S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/26/2018 - 02:29

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్నా ఇంత వరకూ పరిపాలన గాడిలో పడలేదని, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రహసనంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.

05/26/2018 - 02:27

హైదరాబాద్, మే 25: భారతీయతను ప్రపంచానికి చాటిన ధీశాలి స్వామి వివేకానంద అని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్టులో శుక్రవారం నాడు జరిగిన ప్రతిభా పురస్కార కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శిక్షణార్థులకు ధృవపత్రాల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

05/26/2018 - 02:27

హైదరాబాద్, మే 25 రాజకీయ నాయకుల సిఫార్స్‌లను అమలు చేయలేదన్న అక్కసుతో విద్యాశాఖ కమిషనర్ కిషన్‌ను బదిలీ చేయడం సరికాదని 12 బిసి సంఘాల నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజప్తి చేశారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో మంచి పేరు తెచ్చుకున్న అంశా న్ని సిఎం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చన కిషన్‌ను బదిలీ చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమా దం ఉందన్నారు.

05/26/2018 - 02:26

హైదరాబాద్, మే 25: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1,82,40,128 విలువైన 5.7 కిలోల బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టరేట్ (డిఆర్‌ఐ) అధికారులు నెల్లూరు జిల్లాలో పట్టుకున్నారు. ఇంత భారీ స్ధాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది.

05/25/2018 - 04:23

మహబూబ్‌నగర్: భారీ శబ్దాలు.. ఆకాశం నుంచి నేలను తాకే మెరుపులు.. సుడిగాలులు.. దాంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి... భయభ్రాంతులకు గురైన సంఘటనలు మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు చోటు చేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దానికి తోడుగా భారీ గాలులు వీచాయి.

05/25/2018 - 04:33

ఇల్లంతకుంట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొమ్ము మనది సోకు ఆంధ్రా పాలకులది ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సొమ్ము మనదే.. సోకు మనదే అని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూం, శివాలయం పునర్‌నిర్మాణానికి శంకుస్థాపనలు చేయగా, కమ్యూనిటీ భవనాన్ని, ఓ ప్రైవేటు పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.

05/25/2018 - 02:38

నల్లగొండ, మే 24: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ ఆదర్శనీయమని.. ఇచ్చిన మాట మేరకు నల్లగొండ, సూర్యాపేటలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయడంతో వెనుకబడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రగతి ముందడుగు వేయనుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

05/25/2018 - 02:36

సంగారెడ్డి, మే 24: ‘ఒసేయ్ రాములమ్మ’ పేరు చెబితే అక్షర జ్ఞానం అంతంత మాత్రంగా ఉన్న మారుమూల గ్రామాలకు చెందిన సాధారణ వ్యక్తులు ఎవరైనా క్షణంలో గుర్తుపట్టి సినీ నటి విజయశాంతి అని చెప్పగలరు. గడప గడపకు, గుండె గుండెకు తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న విజయశాంతి రాజకీయంగానూ అంతే పేరు సంపాదించుకున్నారు.

05/25/2018 - 02:34

పెద్దఅడిశర్లపల్లి, మే 24: అన్ని రంగాల అభివృద్ధికి నీరే ముఖ్యమని గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి కృషిచేసినట్లు సీఎల్పీ నేత, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరి జానారెడ్డి అన్నారు.

05/25/2018 - 02:32

హైదరాబాద్, మే 24: పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను రిలీవ్ చేసి ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అదర్‌సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. డైరెక్టర్ కిషన్‌పై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావుకు ఫిర్యాదు చేయడంతో ఈ బదిలీ వేటు పడిందని అంటున్నారు. గత నాలుగేళ్లుగా కిషన్ పాఠశాల విద్యకు ఒక స్వరూపాన్ని ఇవ్వడంలో తీవ్రమైన కృషి చేశారు.

Pages