S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/25/2017 - 19:23

పార్టీ ఫిరాయింపులు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెరిగిపోయిన తీరు ప్రజల్లో రాజకీయ, ప్రజాస్వామిక వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నైతిక విలువలు విస్మరించి పదవుల కోసం, డబ్బు కోసం పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధుల వైఖరి ఓట్లు వేసి వారిని ఎన్నుకున్న ప్రజల తీర్పును అవమానించడమే. పార్టీ ఫిరాయింపుల నిరోథక చట్టం ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమైంది.

10/25/2017 - 19:22

ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తరువాత పార్టీ మారాలంటే, ఎమ్మెల్యేకైనా, ఎంపికైనా ధైర్యం ఉండాలి. ఆ ప్రజా ప్రతినిధి పార్టీ మారడానికి అక్కడి ఓటర్లు, పార్టీ క్యాడర్ అంగీకరించాలి. జనం అంగీకరిస్తే పార్టీ మారినా ఇబ్బంది లేదు. పార్టీల మార్పిడికి తెర తీసింది అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమెల్యేలను ఆయన పార్టీలోకి తీసుకున్నారు.

10/25/2017 - 19:22

రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతుంటారు. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణ విషయం. పార్టీలు మారడం తప్పయితే న్యాయవ్యవస్థ అవసరమైతే జోక్యం చేసుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి లోబడే మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. చట్టసభల పరిధిలో చట్టసభలు, న్యాయ వ్యవస్థ పరిధిలో కోర్టులు పనిచేస్తుంటాయి. ఎవరి అధికారాలు వారికున్నాయి.

10/18/2017 - 18:36

భారతదేశంలో అవినీతి ఈనాటిది కాదు, పరిశ్రమలు ఏర్పాటు మొదలు, చిన్న చిన్న పనులు కాంట్రాక్టులకు ఒక పనిముట్టుగా ఉన్న అవినీతి ఈ రోజు అన్ని రంగాల్లో అన్ని సేవల్లోకి ప్రవేశించింది. ఆఖరుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయాలన్నా, ఎంఆర్‌ఐ చేయాలన్నా అవినీతి లేనిదే పనిజరగడం లేదు.

10/18/2017 - 18:36

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అవినీతి విధానాలకు పాల్పడే వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపాలి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైంది. రాజకీయ పార్టీల్లో సంస్కరణలు, జవాబుదారితనం పెరిగే విధంగా శాసనాల్లో మార్పులు తేవాలి. మన కేంద్ర ఎన్నికల చట్టంలో మార్పులు రావాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఏ విధంగానైనా అధికారంలోకి వచ్చేందుకు రకరకాల అవినీతి పద్ధతులను ఉపయోగిస్తున్నాయ.

10/18/2017 - 18:35

అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలకు పదును పెట్టాలి. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందు లేకపోయినా, అవినీతిలో ముందున్నది. అవినీతి జాడ్యం అనేది అనాదిగా వస్తున్నది. దీనిని సంపూర్ణంగా రూపుమాపాలంటే వ్యవస్థలో మార్పు రావాలి. అంటే ప్రజలే తొలుత చైతన్యవంతులై అవినీతిని పారదోలేందుకు కృషిచేయాలి. లంచావతారం ఎత్తే అవినీతి అధికారుల భరతం పట్టాలి. అంటే వారిని తొలుత ప్రోత్సహించరాదు.

10/18/2017 - 18:34

యథారాజా తథాప్రజా... రాజు అక్రమాలకు పాల్పడితే అతని కింద ఉన్న పరివారమంతా అక్రమాలకు పాల్పడుతుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. కేంద్రంలో పార్లమెంట్, రాష్ట్రాల్లో అసెంబ్లీలు పనిచేస్తున్నాయి. చట్టసభలే ప్రజలకు దిశానిర్దేశనం చేస్తుంటాయి.

10/18/2017 - 18:34

ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలకు వెనుకాడబోదు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పరిపాలనా దక్షత, పారదర్శకమైన పాలనను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేసి పట్టం కట్టారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది.

10/18/2017 - 18:33

రాష్ట్రంలోనే కాదు దేశం వ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న అవినీతిని తుది ముట్టించటానికి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైనే కాదు ప్రజాప్రతినిధులు, రాజకీయల పక్షాల నేతలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం చట్టాలను సవరించాలి.

10/18/2017 - 18:33

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత, ప్రజాప్రతినిధులపై పట్టు లోపించిన కారణంగా అటు ప్రజాప్రతినిధులలో, ఇటు అధికారులలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. రాష్టస్థ్రాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. అదే దారిలో కిందిస్థాయి ప్రజాప్రతినిధుల, అధికారులు నడుస్తున్నారు. ఏ పని చేయాలన్నా కమీషన్ల కక్కుర్తి పెరిగిపోయిన కారణంగా అవినీతికి అంతులేకుండాపోతోంది.

Pages