S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/21/2018 - 21:15

సాహిత్యం మెడమీద రాజకీయం కత్తి వేలాడుతున్నప్పుడు, సామ్రాజ్యవాద భావనాచ్ఛాయలు అలుముకుంటున్నప్పుడు, పాలకుల చెప్పు చేతల్లో సాహిత్య రంగం మెలుగుతున్నప్పుడు, స్వేచ్ఛాయుత సాహిత్య కంఠం నిశ్శబ్దంలో కూరుకుపోయి వౌనంగా నేల చూపులు చూస్తుంటూంది. పంటి బిగువుతో ఉబికొస్తున్న కన్నీటిని అణచుకుంటూ, కృత్రిమ హావభావాలు వ్యక్తీకరిస్తుంటూంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

01/21/2018 - 21:15

‘‘తనువు చందనశాఖి
మనసు నందనవాటి
కలముపనిషద్గంగ
గళము హిమనగశృంగ’’

01/21/2018 - 21:13

ఇదుగో వస్తున్నా..!
రుూ మొక్క చుట్టూ వరదగూడులా
పాదుకట్టీ.. కాసిన్ని నీళ్లు పోసీ..!

ఆకు కళ్లు తెరచి
రేపిది రెమ్మ తొడిగితే..
మనం చిగురించినట్టు!

కాసేపాగు వస్తున్నా..!
కొండవాలులోంచి దూకే రుూ వాగు నాగును
ఎండిన పొలాలమీదకు మళ్లించీ..!

తడిదేరీ నేల నవ్వితే..
రేపటితరం పెదాలమీద నెలవంకలా
మనం పచ్చని నవ్వైనట్టు!

01/21/2018 - 21:13

ఆంగ్ల వత్సరమైనా.. తెలుగు వత్సరమైనా
అందరికీ కావాలి శుభారంభం
అమ్మనాన్నల పిలుపు దూరమైనా
మమీ డాడీల గెలుపు చేరువైనా
మారిన కాలానికి మనమే నిలువెత్తు సాక్షులం
పోటీ ప్రపంచంలో గె(ని)లవాలన్నా
తప్పదు అలుపెరుగని పోరాటం
డాలర్లవేటలో అందరూ ప్రయాణికులమే
బంధాలు - అనుబంధాలు
అందరికీ కడు దూరమే
పిల్లలంతా విదేశాలకు తరలుతున్నారు

01/21/2018 - 21:11

చీకటిని చిదిమి
తెలి వేకువ వేగుచుక్కగా
అతని నుదుటిపై ఎర్రని తిలకం
నెత్తుటి సూరీడ్ని పుష్పిస్తుంది
కాలం కాలనాగై కాటేసిన సందర్భాలను
రాలిన కన్నీటి చుక్కల్లో లుప్తపరుస్తూ
అతడు... మరో ప్రస్థానానికై
నిప్పుల గుండంపై పేగు పాశానికి
భస్మాభిషేకం చేస్తాడు!
అజ్ఞాత దుఃఖార్తులకు
వేదన రోదన మిన్నంటిన శోక హృదయాలకు

01/21/2018 - 21:16

‘ఉద్యోగస్థులయిన శ్రీమతులమీద నేను పరిశోధన చేస్తున్నాను. ముఖ్యంగా మన దేశంలో గృహిణులు ఉద్యోగాలు చెయ్యటం అంతగా వ్యాపించలేదు. స్ర్తిలు గృహిణులుగానూ, ఉద్యోగినులుగానూ ద్వంద్వ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారు, ఏయే సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎలా పరిష్కరించుకుంటున్నారన్నదే నా పరిశోధనాంశం’ అంటూ ఒక పరిశోధకురాలు శ్రీమతిగానూ, ఉద్యోగినిగానూ ఉన్న రచయిత్రిని పరిచయం చేసుకుంటుంది.

01/14/2018 - 20:10

అంగనల్ తమ గృహ ప్రాంగణంబుల తీర్చు
రంగవల్లికల హొరంగులందు
విభవంబులొల్క గొబ్బెమ్మలందున కుల్కు
బంతి-చేమంతి పుష్పంబులందు
తెలవార మేలుకొల్పులతోడ కడు కమ్మ
గా పాడు హరిదాసు గళమునందు
స్వయముగా చెమటోడ్చి పండించు ధాన్యమ్ము
గంపకెత్తెడు రైతు కన్నులందు
గంగిరెద్దుల గంతుల పొంగులందు
తేజు మెఱయంచు కోడి పందెమ్ములందు
చెలువు మీఱెడి బొమ్మల కొలువునందు

01/14/2018 - 20:09

నీవు పూవై పరిమళించినంత కాలమే
నీ చుట్టూ ఈ తుమ్మెదల ఝుంకారం

నీవు తెమ్మెరలా మదిని స్పృశించినంత కాలమే
నీ కోసం తన రంగవల్లుల ప్రతీహారం

నీవు మొయలువయ భువిన కురిసిపోతేనే
నీ వయపుకు తలలెత్తే మొలకల పులకరింపు

నీవు స్వాతి జల్లువయతేనే ముత్యపు చిప్పలందు
నీకయ నిత్యమూ ఎదురుచూపుల కైమోడ్పులు

01/14/2018 - 20:08

అరవిరిసి పరిమళిస్తూ పూచే
పెరటి తోటన చక్కన్ని ముద్దబంతి
కమ్మనైన హరిదాసు నృత్యగానం
హరికీర్తనల గూడె చిరుతల తంత్రి
డూడూ బసవన్నల అందెల సడితో
వెల్లి విరిసిన ఆనంద హేల దొంతి
అందాల రంగుల రంగవల్లులతో
మురిపిస్తున్న నవయవ్వన యంతి
అంగరక్షణి వలె పచ్చని పైరులతో
సుందరమైన పల్లె మాగాణీ ప్రకృతి
అందివచ్చిన కొత్త పంటలతో
ఇంటింటా బంధువర్గ సహబంతి

01/14/2018 - 20:08

సంక్రాంతీ... మకర సంక్రాంతి
బక్కచిక్కినవారి బాధలన్నీ తీరి
బతుకు బాగుపడితే నవ్వుల సంక్రాంతి
కిలోల కొద్ది వీపు మోతలేని చదువు దొరికితే
బడిపిల్లలకు భలే సంక్రాంతి
పండించిన రైతన్నకు
సరియైన రొక్కమిస్తె దరహాస సంక్రాంతి
తిండి దొరకని వృద్ధులకు
వేళకు అన్నపానాదులందితె మురిపాల సంక్రాంతి
కొలువులున్నోళ్లు కునుకు తీయకుండ

Pages