S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/14/2018 - 20:06

జనగణాల ఆపాదమస్తకం
ఆవరించిన మంచుదుప్పట్లను
చీల్చుకుంటూ వచ్చాయ
సంక్రాంతి సముజ్వల క్రాంతిరేఖలు

భోగిమంటలతో భోగభాగ్యాలతో
కొత్త అల్లుళ్లతో కొంగ్రొత్త ఆశలతో
సంతసాల మేళవింపుతో
సౌరభాల గొబ్బిళ్ళతో
కోడిపుంజుల పందేలపట్లతో
జనాలను పరవళ్ల జల్లులలో
ముంచెత్తటానికి నడుం బిగించి
నట్టింట నిలిచింది నవనవలాడే
నవ్యక్రాంతి అదేనండి సంకురాత్రి..

01/14/2018 - 20:05

చుక్కల అంబరాన్ని తొడిగిన
వినీలాకాశం మిణుగురులై తళుకులీనగ
లేలేత చిగురు దారాల
అల్లికలుగ నేసిన ఆకుపచ్చని
చీరకట్టిన ప్రకృతి కాంత
మందస్మిత మందగమన
మలయమారుత అతి శీతలములకు
సోయగాలు పోగ
సప్తవర్ణ సొబగులద్దుకున్న
లతాంతికలు గాలి అలలుగా
సౌరభాలు వెదజల్లగ
తెలుగు మాగాణి
పసిడి ధాన్యరాశిగ మారగ
పక్షుల కిలకిలారావములై

01/14/2018 - 20:04

ముగ్గులు దిద్దిన
ముంగిళులందున
ముచ్చటలాడే గొబ్బెమ్మా! మా
పచ్చని తల్లీ! గొబ్బెమ్మా! ...ము

నవ భావములను
అనురాగములను
నారు వోసినా గొబ్బెమ్మా! మా
నవ్వుల తల్లీ! గొబ్బెమ్మా! ...ము

రంగు రంగులా
రంగవల్లులను
కొంగున దెచ్చిన గొబ్బెమ్మా! మా
కోర్కెల తల్లీ! గొబ్బెమ్మా ...ము

01/14/2018 - 20:02

పండగ... పండగ...
తెలుగిళ్ళ లోగిళ్ళు తళతళ మెరిసే పండగ
పెద్దలు నచ్చే పండగ, పిన్నలు మెచ్చే పండగ
పెద్దల్ని కొలిచే పండగ, సుద్దుల్ని పంచే పండగ
భూమాత ఈస్ట్‌మన్ కలర్లో తళుకులీనే పండగ
గోమాత పొదువు ముంతడు పాలతో పొంగిపొర్లే పండగ
ఇబ్బడిముబ్బడిగా పంట కళ్ళాల రాశులు నిండే పండగ
పిల్లా, పెద్దా, గొడ్డు, గోదా - నవ్వగలిగే పండగ
తుళ్ళి తుళ్ళి ఎగరగలిగే పండగ

01/14/2018 - 20:01

అన్నీ గుర్తే
అవును నాకన్నీ గుర్తే
హేమంతపు ప్రభాతాన
వణికించు చలిలో రగ్గుల నడకలు
ప్రయవేటుకు రగ్గుతో నేను
అమ్మపాలు పితకడానికి
త్రోవలో నాతోబాటు
నా చుట్టూ ఎన్నో రగ్గులు
కొన్ని పొలానికి
కొన్ని పాల కేంద్రానికి
కొన్ని చలిమంటల చెంతన
కోళ్ళ దగ్గర పిండి దంచుతూ కొన్ని
చెరువుకు నీళ్ల్లకి కావిళ్ళతో కొన్ని

01/14/2018 - 20:00

ఎండిపోయన ఆకుల్లాంటి
అలవాటైన మూసపోసిన రోజుల్లో
చిగురించిన పత్ర స్వప్నం పండగ దినం
శిబిరంలో పలకరించే సూర్యకిరణం

01/07/2018 - 21:17

రుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన అన్నట్లు, ‘కథకులందు పుణ్యకథకులు వేరయా’ అనాలనిపిస్తుంది ‘మనవే’ అనిపించే విహారి కథలు చదివినప్పుడు. మానవీయ విలువల మహిత సంపదను మూటగట్టిన నిధులు వారి కథలు. విహారి కథల్లో -
విలక్షణత వుంది,
హాయిగా చదివించే పఠనీయత వుంది,
రిరంసవాటిల్లోది ప్రధానంగా జీవన మూల్యాలది.

01/07/2018 - 21:14

అతడు
కవిత్వం రాస్తున్నాడు
మరో ప్రపంచం కోసం
కలలు కంటున్నాడు

చిత్రం
వేవేల భావాల దృశ్యమానం
ఊహకందని
రహస్య లిపి

అబద్ధానికి
ఆయుస్సు ఎక్కువ
ప్రపంచమంతా
దాని మురికిలోనే
*
- భీంపల్లి శ్రీకాంత్
9032844017

01/07/2018 - 21:14

స్వాగత ఝరులు
శుభాకాంక్షల వెల్లువలు
సంతోషపు అలల వేడుకల వేగాలు
ఈ యేటికి ఉత్సాహం తెచ్చాయ
సంబరం అంబరాన్నంటినా
పాతదే కొత్తదయంది, ప్రవాహం ఒకటే
కాళ్లకు తడారని కదలని శిలగా చూస్తూనే ఉన్నా
కొత్తొక వింతయనా అది పాతదవ్వాల్సిందే
కొత్తయనా పాతయనా అది ప్రవాహమే కదా!
పగళ్లూ, రాత్రులూ, వారాలూ, నెలలూ
ప్రవాహానికి కొట్టుకుపోతూనే ఉన్నాయ

01/07/2018 - 21:12

కెమేరా లాంటిదా
కవిత్వం
ఎవరెన్ని ఫొటోలు తీసినా
అన్నీ వేరు వేరు

కళ్ల తలుపుల్ని మూసేస్తే
కలల కిటికీలు తెరుచుకుంటున్నాయ
కాంతి వేగంతో కలలొచ్చి పోతాయా
అడవిలోలా ఏ చెట్టూ
నగరంలో పెరగటానికి లేదు
అక్కడ అన్నింటికీ
ఒక పరిధి ఉంటుందన్నది తెలీదా

ఇళ్లల్లో కలప అంతా
ఒకప్పటి అడవిలో
ఎన్ని చెట్ల మాంసపు కండలో

Pages