S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/31/2017 - 21:59

వస్తూ పోతున్నాయి
వత్సరాలెన్నో
వడి వడిగా విచ్చేస్తూ
వలపును పంచుతూ

నిత్యనూతనంగా
నిండు యవ్వనంతో
నిటారుగా నిలబడుతూ
నిజాల్ని గమనిస్తూ

సహజత్వాన్ని ఆహ్వానిస్తూ
సక్రమ మార్గాల్ని ఆశిస్తూ
సకల జనుల క్షేమం కోసం
సద్వినియోగ ఆశల కోసం

12/31/2017 - 21:58

అరుణ కిరణాల గిలిగింతలకు,
కితకితలకు,
కించిత్తు బద్ధకంగా ఒళ్లు విరుచుకొనే
నిర్లిప్తతకు నిలువుటద్దం,
ఆనందానికి అవరోధం,
పొంగివచ్చే దుఃఖం పేరుకుపోయినట్లు
ప్రయాణ పురోగమనానికి ప్రమాద హేతువు
శతృశిబిర నిఘా నేత్రానికి అడ్డుతెరలా
సువిశాల శే్వత కుడ్యం
సుదూర శే్వతనగం
ప్రేమికుల పెన్నిధి
వృద్ధ, వ్యాధిగ్రస్తుల నిషేధం

12/31/2017 - 21:57

కొత్త ఏడాది మళ్లా మున్నూటరవై అయిదు వేకువలను తీసుకురాబోతున్నది. వెయ్యేళ్ళ ముందర శాసన హోదా గల భాషగా, ఒక సహస్రం నుంచి సృజన సంపదగా, నన్నయ, పాల్కురికి రెండు తీరులుగా అందించిన రచనలుగా వేల పదాలు మన ముందర కుప్పలుగా పడివున్నాయి. అవి ప్రతి శతాబ్దంలో విస్తృతమవుతూ వచ్చాయి. గత వెయ్యేళ్లుగా నిర్విరామ సాహిత్య రచన భిన్న రూపాల్లో జరుగుతూనే ఉన్నది.

12/31/2017 - 21:56

నూతన సంవత్సరానికి స్వాగతిస్తూనే
నూతన ఆలోచనల సరళిని కూడా
స్వాగతమివ్వాలి
నూతన సంవత్సరమంటేనే హృదయం నిండా
నూతన భావాలతో కూడిన ప్రణాళికలను
సిద్ధపరచుకోవడం
కొత్త ఆశయాలకు జన్మనివ్వడం

12/31/2017 - 21:55

కలం, గళం
కలగలిస్తే చైతన్యం

చైతన్యం చేవతో చచ్చిపోదా
సమస్య చిన్నదై

కాలం, కార్యం జోడిస్తే
జయం నీదే

నడిచి వచ్చేకాలం
నీ జయమై, నీలో విజయనాదమై
వచ్చే వత్సరమొస్తుంది వడి వడిగా
నూతన సంవత్సరమొస్తుంది
నూతనోత్సాహంతో
స్వాగతిద్దాం - సాధిద్దాం
*
- వెంకటేష్, కరీంనగర్

12/26/2017 - 20:50

కేంద్రంలో సకల భారతీయ భాషల ఏక సంస్కృతిని, వారసత్వాన్ని, సాహిత్య రీతులను ఆసేతు హిమాచలం ఆత్మీయం చేసే మహత్తరాదర్శంతో ప్రభవించింది కేంద్ర సాహిత్య అకాడమి. ఇప్పటికి ఇంచుమించు 66 సంవత్సరాలుగా ఈ గొప్ప సంస్థ తన ఉనికిని ప్రకటించుకుంటున్నది. కొన్ని వేల ప్రచురణలను, కొన్ని వందల సదస్సులు, గోష్ఠులు, భారతీయ విశిష్ట రచయితల జయంతులు ఈ సంస్థ నిర్వహించి ఉండవచ్చు.

12/26/2017 - 20:48

సగం చీకటి భూమిపై రాలిపడి
మిగిలిన సగం జలపాతంలా
గగనం నుండి
దూకుతున్న సమయాన
విశ్వాన్ని గర్భంలో
దాచుకున్న ఆ తల్లి
కోటానుకోట్ల సూర్యకిరణాలను
పండువెనె్నలను ముద్దలుగా కలిపి
మాయపు ప్రపంచంలోకి
రక్తపు మరకలతో ఒక కాంతిని తోసింది
ఆ కాంతి యొక్క రక్తపు మరకలు
మా దేహాలకు
రేగికంపలా అతుక్కున్న పాపాన్ని కడిగి

12/26/2017 - 20:48

మునుపెన్నండును గాంచనట్టి పగిదిన్ ముంచెత్త కోలాహలం
బనగా తెన్గు మహాసభల్ మహిని సౌహార్దమ్ము వీచన్ ఘనా
ఘనమై కావ్యమరంద మొల్కెను వియద్గంగా తరంగంబుగాన్
మన రాష్ట్రంబయె తల్లి భారతి మెడన్ మాణిక్యహారమ్ముగా

12/26/2017 - 20:46

నూరు పద్యాల సంకలనం శతకం. ఇంకొక ఎనిమిది అదనంగా చేర్చడం కూడా సంప్రదాయం. పద్యసాధనకు తొలినాళ్లలో అందరూ చేపట్టే ప్రక్రియ శతకం. శతకానికి ఛందోనియమం, మకుట నియమం, సంఖ్యా నియమం ఉంది. శతక పద్యాలను ఏ ఛందస్సులోనైనా రాయవచ్చు. కానీ శతకం ఆసాంతం అదే ఛందస్సులో కొనసాగాలి. ఏ మకుటం స్వీకరించినా, అదే మకుటం శతకం అంతా ఉండాలి. పద్య సంఖ్య నూరుగానీ, నూట ఎనిమిదిగానీ ఉండాలి. ఇదీ శతక ప్రక్రియలోని ప్రధాన లక్షణం.

12/26/2017 - 20:45

పిచ్చోడు లేని ఊరుంటదా
కుక్క కాటులేని మనిషుంటాడా
కలుపు లేని పొలముంటదా
కొంగలు విసర్జించని చెట్టుంటదా
అవమాన గాయాలను దాటినోడే
గాగనాన వేకువయతడు!

చినిగిన ఆకుల్ని కుప్పేసుకొని
వొల్ల వొల్ల దుఃఖిస్తేట్ల
అయనదానికి కానిదానికి
పక్కింటోని అనుమానించి నిందిస్తెట్ల?

Pages