S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/11/2017 - 00:28

ఇక మొగ్గ తొడగడం వుండదనే
స్థితి తెలిసినప్పుడు
దించుకోలేని దిగులు

ఇన్నినాళ్లు
ఎగిరెగిరిపడిన కోరికలు
సహజంగా ఇంకిపోతున్నాయనే
గతి ఎరిగినప్పుడు
పంచుకోలేని వగపు

బీపీ, తీపీ కలగల్సిన పెయ్య
దినమంతా చేదు ఎక్కుతుంది

12/11/2017 - 00:27

అనాథల ఆక్రందనలు, అన్నార్తుల ఆవేదనలు, అభాగ్యుల ఆర్తనాదాలు, అసమర్థుల ఆత్మకథలు, మోసపోయిన వారి బాధలు, కలలు కల్లలైన కన్నీటి గాథలు - వెరసి పెద్ద్భిట్ల సుబ్బరామయ్య కథలు. పెట్టుబడిదారీ సమాజం వికృత స్వరూపాన్ని, దయలేని దోపిడీదారులు, వారి పదఘట్టనల కింద నలిగిపోతున్న వారి జీవితాలను అక్షర చిత్రాల్లో ఆవిష్కరించిన అసామాన్య కథకులు పెద్ద్భిట్ల.

12/11/2017 - 00:26

‘ఒకానొక ప్రముఖ ఆంగ్లపత్రిక ఫొటోగ్రాఫర్‌గా ప్రపంచంలో చూసిన అనేకానేక దేశాల్లో సైతం ఇంతటి శోభాయమానమయిన ప్రకృతిని తాను చూడలేదనుకున్నాడు- చక్రవర్తి’

12/03/2017 - 21:27

‘‘శ్రీలు పొంగునట్టి పాలకడలి బిడ్డ
తెలుగు గడ్డ మనకు వెలుగు గడ్డ
అఖిల భారతాంబ కందాల వీణరా
తెలివి కలిగి మెలగు తెలుగు బిడ్డా’’

12/03/2017 - 21:25

మన మాటల చూపులు
మొదటిసారి కలిసినప్పుడే
నీ రెక్కల్ని చూశాను
ముడుచుకుని
భయంభయంగా సర్దుకుంటూండగా
అస్తిత్వాన్ని దాచుకోలేక
సంకోచంగా అటూ ఇటూ కదులుతుండగా..

ఎగిరే వాంఛని
ఈకలుగా మొలిపించుకొన్న రెక్కలు
ఎంతందమైనవి!
ఎంత శక్తి దాగుంది వాటిలో!

ప్రియమైన పాలపిట్టా
సందేహించకు
రెక్కల్ని విప్పారనివ్వు

12/03/2017 - 21:24

తెల్లని మల్లెల సువాసనలందించింది
పచ్చని చేమంతుల పూబంతుల
అందాలను పంచింది
గులాబీ పరిమళాల గుబాళించింది
పత్రహరితం నింపి చెట్ల ఆకుల నీడనిచ్చింది
అందమంటే తెలిపింది ఆనందమంటే తెలిపింది

12/03/2017 - 21:23

ఎగిరెల్లిపోవాలి
అప్పుడప్పుడూ.. వున్నచోటునుండి.

12/03/2017 - 21:21

‘పెళ్లాముతో కాపురము చేసేటప్పుడు ఆయన ఒక్క రోజు భార్యతో కలిసిమెలిసి లేడు. ఎప్పుడూ పెళ్లాన్ని కొట్టడమో, తిట్టడమో! అంతేకాని చిలకా గోరువంకలాగా వుండేవాళ్లుకారు. ఏమో అన్యోన్యము లేదని చెప్పితే వాళ్లకిద్దరు పిల్లలు ఎలా కలిగారు? అదో గాలిపాటు!

11/26/2017 - 23:44

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’’ అన్న విశ్వమానవ సౌభ్రాతృత్వ గీతం ఒక్కటి మిగిలినా, గురజాడ ప్రపంచ మహాకవి అవుతారు అని శ్రీశ్రీ ఒక సందర్భంలో అన్నారు. అలాంటి దేశభక్తి గీతానికి పునాదులు వందేళ్ల ముందరి 1795 నాటి రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహాకవి గేయాల్లో దేశభక్తి గీతం పునాదులున్నాయి. గురజాడ, బర్న్స్ కవిని చదువుకున్న, ఇష్టపడిన, ఉటంకించిన ఆధారాలు 1910 తరువాతి గురజాడ వ్యాసాల్లో గమనిస్తాము.

11/26/2017 - 23:42

సత్యశీలికి తలబరువు కాగల లేమి ఉన్నదా
అన్నింటా, ఆ అన్నింటా
దాటిపోతాము పిరికి బానిసలను
వీరికన్నా లేమియే మిన్న
అన్నింటా ఆ అన్నింటా
మన పాటుకేమి విలువ
పదవిదేమున్నది ఒక నాణేన ముద్దర
మనిషి అన్నింట బంగారము

Pages