S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/26/2017 - 20:48

మునుపెన్నండును గాంచనట్టి పగిదిన్ ముంచెత్త కోలాహలం
బనగా తెన్గు మహాసభల్ మహిని సౌహార్దమ్ము వీచన్ ఘనా
ఘనమై కావ్యమరంద మొల్కెను వియద్గంగా తరంగంబుగాన్
మన రాష్ట్రంబయె తల్లి భారతి మెడన్ మాణిక్యహారమ్ముగా

12/26/2017 - 20:46

నూరు పద్యాల సంకలనం శతకం. ఇంకొక ఎనిమిది అదనంగా చేర్చడం కూడా సంప్రదాయం. పద్యసాధనకు తొలినాళ్లలో అందరూ చేపట్టే ప్రక్రియ శతకం. శతకానికి ఛందోనియమం, మకుట నియమం, సంఖ్యా నియమం ఉంది. శతక పద్యాలను ఏ ఛందస్సులోనైనా రాయవచ్చు. కానీ శతకం ఆసాంతం అదే ఛందస్సులో కొనసాగాలి. ఏ మకుటం స్వీకరించినా, అదే మకుటం శతకం అంతా ఉండాలి. పద్య సంఖ్య నూరుగానీ, నూట ఎనిమిదిగానీ ఉండాలి. ఇదీ శతక ప్రక్రియలోని ప్రధాన లక్షణం.

12/26/2017 - 20:45

పిచ్చోడు లేని ఊరుంటదా
కుక్క కాటులేని మనిషుంటాడా
కలుపు లేని పొలముంటదా
కొంగలు విసర్జించని చెట్టుంటదా
అవమాన గాయాలను దాటినోడే
గాగనాన వేకువయతడు!

చినిగిన ఆకుల్ని కుప్పేసుకొని
వొల్ల వొల్ల దుఃఖిస్తేట్ల
అయనదానికి కానిదానికి
పక్కింటోని అనుమానించి నిందిస్తెట్ల?

12/26/2017 - 20:44

‘వీరేశలింగం, గురజాడ, రాజరామమోహన్‌రాయ్, గాంధీలు వచ్చాక భూమి బరువెక్కింది, గాలి తేలిక పడింది. సంస్కార బీజాలు యువకుల హృదయాల్లో పడి మార్పుకి అనువైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుంటున్నై.. మనుషులు మారుతున్నారు.

12/17/2017 - 23:38

వెయ్యేళ్ల తెలుగు సాహిత్య నేపథ్యంలో మన వర్తమానం ఉన్నది. ఇవాల్టి ప్రాంతీయ పరిమితులు ఆనాటివారికి వర్తించవు. అలా వర్తింపచేసి సాహిత్యాన్ని దర్శిస్తే, మంచి ఫలితాలను రాబట్టలేము. క్రీ.శ. ఆరేడు శతాబ్దాలనుంచి, శాసన భాషగా తెలుగు ఉన్న దాఖలాలు రాయలసీమ శాసనాల్లో ఉన్నాయి. శాసన భాష అంటే రాజ వ్యవహారిక భాష. ఒక రకంగా గెటిట్ నోటిఫికేషన్‌లో వాడే భాష వంటిది.

12/17/2017 - 23:34

చక్కని పల్కులు జక్కని కుల్కులు జాణత సోకులు సంపదగా
చుక్కల సొంపులు సుందర తూపుల జూపుల కన్నియ సుందరిగా
అక్కజ మందుచు నందరి మెప్పులనద్భుత భాషగా ఆలతిగా
మక్కువ మీరగ మానుడి తెల్గును మాగుడి గొల్తుము మాతగవౌ

12/17/2017 - 23:34

తెలుగు వెలుగు కోసం మరో మహా అంకురార్పణం
అమృత భాష పునర్ వైభవానికి చిరు ప్రయత్నం
అమ్మ భాషాభివృద్ధిని తలచి ముస్తాబయ్యెన్ భాగ్యనగరం
విరివిగా సాంస్కృతిక వేదికలు.. విభిన్న సమాలోచనలు
జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటాలి ఈ సంరంభం
వీనుల విందైన అమ్మభాషను అభిమానిద్దాం..
అక్కున చేర్చుకుందాం
భావితరాలకు ఇదే స్ఫూర్తిదాయకం

12/17/2017 - 23:33

క్తిత్వంలోని ప్రత్యేకతవల్ల కొంతమంది గుర్తుండిపోతారు. పేరులో ప్రత్యేకతవల్ల కొంతమంది గుర్తుండిపోతారు. కానీ వ్యక్తిత్వము, పేరులోని ప్రత్యేకత వల్ల గుర్తుండిపోయేవారు ఘనశ్యామల ప్రసాదరావు. వారి పూర్తిపేరు కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు. మా కుటుంబంతో వారికి కొన్ని దశాబ్దాల ఆత్మీయానుబంధం ఉంది.

12/17/2017 - 23:30

పండువెనె్నలను మధిస్తే
పుట్టిన వెన్నముద్ద తెలుగు
భావావేశ క్షేత్రాన్ని దున్ని నాట్లు వేస్తే
మొలచి నిలిచిన పచ్చని చక్కని మొక్క తెలుగు
ఎప్పటికప్పుడు పరివర్తనమవుతూనే
పరిణత భవంతిలా మారిన
ఆమూలాగ్రం తెలుగు
కటిక చీకట్లో సన్నసన్నగా వెలుగుతూ
నేలపైకి దిగొచ్చిన మిణుగురమ్మ తెలుగు
వాత్సల్యం తెలుగు, వారసత్వం తెలుగు
గళం తెలుగు,

12/11/2017 - 00:32

రసగంగ కృష్ణ ఒకప్రక్క, ప్రపంచ కవితా తృష్ణ మరో ప్రక్కన, వివిధ భాషల మయూరాలు గొంతులు విప్పాయి. భావాల జీవధాతువులతో పురులు విప్పాయి. అక్షాంశ రేఖాంశ పరిధుల్ని దాటి అక్షర కవితా పఠనలు చేశాయి. విజయవాటిక - బహు భాషల బహు విధముల కవితా పేటిక విప్పి, కవిత్వ పర్వ శుభదినాలుగా ఆవిష్కరించుకుంది.

Pages