S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనిషి కోసమే

ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి పిలిచి
తాను తింటున్న అన్నంలో
ఇంత ముద్ద పెట్టి
ఆత్మీయతను పంచినవాడు
అతడు మనిషి
శోకంతో కన్నీరు విడుస్తున్న వాని దరిజేరి
నీకు అండగా నేనున్నానని పలికి
ఆత్మబంధువుగా కన్నీరు తుడిచేవాడు
అతడు మనిషి
నడిరోడ్డుపైన నడవలేని
వికలాంగుని చేయి పట్టుకుని
నాన్నా! నిన్ను అవతలికి దాటిస్తానని
ఆత్మీయంగా ముందుకు వచ్చినవాడు
అతడు మనిషి
చెట్ల కింద బతికే జీవితాలను చూసి
జీవుని వేదన ననుభవించి
సాటి మనిషి కోసం
శ్రమించే మానవతా మూర్తి
అతడు మనిషి
విశాల హృదయంతో
విశ్వనరుడుగా ఎదిగి
మానవాళి సంక్షేమ లక్ష్యంగా
మనుగడ సాగించేవాడు
అతడు మనిషి
మనిషిలో
మానవతా దీపాన్ని వెలిగించడమే
నా లక్ష్యం
మనిషిని
మానవోత్తమునిగా మార్చడం కోసమే
నా కవిత్వం

-డా.తిరునగరి 9705146706