S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మర మనుషులం కాదు..!

అంకిత భావంతో
అడుగు తీసి అడుగేయలేని
బలహీనులు బలోపేతం కావాలి
స్వార్థ సంకుచితత్వాలతో
చినిగిపోతున్న కాగితపు గుండెలు
విశాల హృదయ కమలాలై
మన బ్రతుకుల్లో సౌరభాలను
ఆశ్చర్యానందాల కలబోతగా
అంతటా వెదజల్లగల్గాలి
అహింసా సిద్ధాంతాన్ని గూర్చి
అరక్షణమైనా ఆలోచించగల్గాలి
త్యాగఫలాలను తనివితీరా
ఆస్వాదించే దిశలో మన పయనం
పదిమందికి ఆదర్శం కావాలి
కలల సాకారాన్ని కనులారా
వీక్షించాలన్న సంకల్పానికి
బలమైన పునాది వేయగల్గాలి
భావితరాల నీరాజనాలందుకునే
భాగ్యానికి ఎంతగానో నోచుకోవాలి
వ్యక్తిత్వ వికాసంతో
వెల్గులు విరజిమ్మగల్గాలి
అంతకుమించి
కీ ఇస్తే పని చేయడానికి
మరమనుషులం కాదని గ్రహించాలి!

-కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262