మొగ్గలు
Published Saturday, 28 September 2019నవకవిని స్వేచ్ఛగా చిగురింపచేస్తేనే కదా
అతడు కవితావనమై నిండా విరబూస్తాడు
అతని కవిత్వం పరిమళించే మందారం
అక్షర మొగ్గలు చిగురించి పరిమళిస్తేనే కదా
కవితా సుగంధం అంతటా వ్యాపించేది
అక్షరం మొగ్గతొడిగితేనే కవిత్వం భాసించేది
అమ్మ చేతి వంట తింటేనే కదా
ఏదైనా అమృతమై ఆకలి తీరుస్తుంది
అమ్మ ఆకలి తీర్చే అక్షయపాత్ర
అజ్ఞానమనే చీకటిని తరిమితేనే కదా
విజ్ఞాన వెలుగులు లోకంలో ప్రసరించేది
విజ్ఞానం జగతికి వెలుగునింపే కిరణం
యువకవిని అక్కున చేర్చుకుంటేనే కదా
నవ కవిత్వానికి నాందీ వాచకమవుతాడు
అతడు కవిత్వమై మెరిసే కాంతిపుంజం.