S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 04:18

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వైద్యశాఖ ఉద్యోగులు, డాక్టర్లు, సిబ్బంది సెలవులు తీసుకోవద్దని చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవులు వద్దని తెలిపారు. ఆదివారాలు కూడా వైద్య సేవకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

09/24/2016 - 04:18

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ జిల్లాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, రబీ పంటలకు ఏర్పాట్లపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల పంటలకు మంచి జరిగిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. ఎక్కడైనా భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగి ఉంటే వివరాలు సేకరించి తనకు పంపించాలని ఆయన ఆదేశించారు.

09/24/2016 - 04:15

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పాలకమండలిని విస్తరించారు. అందులో 12 మంది ఐఎఎస్ అధికారులతో పాటు 14 మంది వైస్ ఛాన్సలర్లకు సభ్యత్వం ఇచ్చారు.

09/24/2016 - 04:14

బెంగళూరు, సెప్టెంబర్ 23: కావేరీ జలాల వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఈ నదీ జలాలను కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలంటూ కర్నాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడుకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల నిమిత్తం అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయలేమని స్పష్టం చేసింది.

09/24/2016 - 04:13

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఓటుకు నోటు కేసులో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన బెయిలబుల్ వారెంట్ అమలుపై హైకోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

09/24/2016 - 04:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ ఆధ్వర్యంలో శుక్రవారం 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల విభజనపై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు.

09/24/2016 - 04:09

విశాఖపట్నం (పరవాడ), సెప్టెంబర్ 23: నేను నిప్పు, నాపై కేసులు పెట్టే దమ్ము ఎవరికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విశాఖ జిల్లా పరవాడలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 50.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1,839 గృహాల సముదాయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై నిప్పులు చెరిగారు. ‘నా జీవితంలో ఎప్పుడూ లాలూచీ పడలేదు.

09/24/2016 - 04:07

విజయవాడ, సెప్టెంబర్ 23: మాజీ కేంద్ర మంతి కోట్ల సూర్యప్రకాశరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కర్నూలు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు, కాంగ్రెస్ నేత ఎం.సుధాకర్‌బాబు శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస గృహంలో తెలుగుదేశంలో చేరారు. మాజీ కార్పొరేటర్లు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులతో సహా మొత్తం 500 మందితో కలిసివచ్చి పచ్చ కండువాలు బాబుచే కప్పించుకున్నారు.

09/24/2016 - 04:05

కర్నూలు, సెప్టెంబర్ 23: రాయలసీమవాసులకు సంజీవనిగా పేరుగాంచిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మొట్టమొదటి గుండె శస్తచ్రికిత్స విజయవంతమైంది. 60 ఏళ్ళ ఆసుపత్రి చరిత్రలో మొదటిసారి గుండె శస్తచ్రికిత్స విజయవంతం కావడంతో వైద్యులు విజయగర్వంతో సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని పాతబస్తీకి చెందిన షాదిజాబీకి చేసిన గుండె శస్తచ్రికిత్స విజయవంతమైంది.

09/24/2016 - 04:02

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: తెలంగాణ ప్రభుత్వం తన భూమిని ఆక్రమించుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. శుక్రవారం అమె హోంశాఖ మంత్రిని కలిసి, ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు.

Pages