S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 00:11

కాకినాడ, డిసెంబర్ 2: జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ డిప్యూటీ ఛీప్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ ఎంవి శివకుమార్ రెడ్డి సూచించారు.

12/03/2016 - 00:10

బిక్కవోలు, డిసెంబర్ 2:హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. శుక్రవారం ఆయన బిక్కవోలు ప్రాచీన శ్రీ గోలింగేశ్వరస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు సన్నిధిరాజు సుబ్రహ్మణ్యశర్మ ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామీజీ స్వయంగా శ్రీ గోలింగేశ్వరస్వామి వారికి అభిషేకంతో పాటు హారతి ఇచ్చారు.

12/03/2016 - 00:10

కరప, డిసెంబర్ 2: మహిళలు వంటిటికే పరిమితం కాకుండా వారు ఆర్దికంగా నిలదొక్కుని సంఘంలో గౌరవంగా బ్రతికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు.

12/03/2016 - 00:09

రంపచోడవరం, డిసెంబర్ 2: ఏజన్సీలో పెద గెద్దాడ గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా త్వరలో ప్రకటించబడి ఏజన్సీలోని గ్రామాలకు ఆదర్శంగా నిలవబోతోందని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన రంపచోడవరం మండలంలో పర్యటించారు. ముందుగా రంపచోడవరంలోని సూపర్ బజార్ వద్దనున్న రేషన్ డిపోలో అరువుపై నిత్యావసరాల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

12/03/2016 - 00:09

రామచంద్రపురం, డిసెంబర్ 2: డోనార్స్‌క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సినీ సంగీత దర్శకులు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మాట-ఆట-పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. మాట్లాడటానికి లేవగానే విద్యార్థులు, ప్రజాసమూహం నుండి పాట కావాలంటూ నినాదాలు చేయగా..ఏ పాట పాడమంటారని దేవిశ్రీ ప్రసాద్ అడిగారు.

12/03/2016 - 00:07

కడప,డిసెంబర్ 2: ఏడాదిలోపు రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా వస్తాయో వైకాపా అధినేత వైఎస్ జగన్ చెప్పాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.

12/03/2016 - 00:06

కడప,డిసెంబర్ 2: జిల్లాలో రైతులు సాగు చేసిన పంటు సరైన దిగుబడి రాక, సకాలంలో వర్షాలు కురవక రైతాంగం కుదేలవుతుంది. దీంతో రైతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఖరీఫ్‌లో పంటలు దక్కక రబీలోనైనా పంటలు దక్కించుకోవచ్చునని కోటి ఆశలు పెట్టుకున్న జిల్లా రైతాంగానికి రబీ సీజన్‌లో కురవాల్సిన వర్షం కురవకపోవడంతో ఈ ఏడాది మెట్టసాగుకు విత్తనం వేసే పరిస్థితికి కూడా నోచుకునే అవకాశం కన్పించడం లేదు.

12/03/2016 - 00:06

కడప,డిసెంబర్ 2: మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో కడపలో అధికార, ప్రతిపక్ష పార్టీల అధిష్ఠానాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆపార్టీని బలహీన పరిచేందుకు అధికారపార్టీ నేతలు ప్రత్యేకవ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

12/03/2016 - 00:05

కడప,(కల్చరల్)డిసెంబర్ 2: జిల్లాలో వివిధ పథకాలు అమలుచేసే మంజూరుకు ఎంపికకు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల అధికారులతో, ఆర్డీవోలు, పల్స్‌సర్వే, ఓడిఎఫ్, నగదు రహిత లావాదేవీలు, పెన్షన్స్, గృహనిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

12/03/2016 - 00:05

కమలాపురం, డిసెంబర్ 2: కమలాపురం ఐసిడియస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం ఎల్‌కెజి, యుకెజి, నర్సరీలను ఎమీవో జాఫర్‌సాధిక్ లాంఛనంగా ప్రారంబించారు. పట్టణంలోని 9వ వార్డులో యల్‌కెజి, 7వ వార్డులో యుకెజి, 8వ వార్డులో నర్సరీ తరగతులు ప్రారంభమయ్యాయి.

Pages