S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 23:54

చిట్యాల, డిసెంబర్ 2: పండ్లు, కూరగాయల సాగు కోసం అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తోటల పెంపకానికి ప్రోత్సహిస్తున్నామని ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ జిల్లా అధికారి సంగీతలక్ష్మి అన్నారు.

12/02/2016 - 23:54

రామన్నపేట, డిసెంబర్ 2: యాదాద్రి జిల్లాలో టిడిపి బలోపేతం అవుతుందని పార్టీ జిల్లా అద్యక్షుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది నాయకులు పార్టీమారిన గ్రామాలలో టిడిపికి కార్యకర్తల బలం పటిష్టంగా ఉందని అన్నారు.

12/02/2016 - 23:53

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలకు సిద్దం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9,10 తరగతులకు పరీక్షల సన్నధ్దం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. స్లిప్‌టెస్టుల ద్వారా వెనుకబడిన విద్యార్ధులను ప్రోత్సహించాలన్నారు.

12/02/2016 - 23:52

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: కేబుల్ టీవి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం జరిగిన కేబుల్ ఆపరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాల్గవ విడత కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎం ఎం ఒలు విధిగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి కేంద్ర ఆదేశాలు పాటించాలన్నారు.

12/02/2016 - 23:51

సిద్దిపేట, డిసెంబర్ 2 : దేశంలోనే క్యాష్‌లెస్ నియోజకవర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు బీడీ కార్మిక సంఘాల నేతలు సహకరించాలని..ప్రజల వద్దకు అధికారులు వచ్చేలా చర్యలు చేపడుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలసి టిఆర్‌ఎస్ కార్మిక విభాగం, బిఎంఎస్, ఎఐటియుసి కార్మిక సంఘాల నేతలతో చర్చించారు.

12/02/2016 - 23:50

సిద్దిపేట, డిసెంబర్ 2: ఏడేడు జన్మల నుంచి బ్రహ్మముడి ఉంటుందనడంలో ఎంత నిజం ఉందో తెలియదుగానీ..దంపతుల్లో ఒకరు మరణిస్తే మరొకరు క్షణం కూడా మనలేని దయనీయ ఘటన సిద్దిపేట జిల్లా బంజేరుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య కన్నుమూసిన కొన్ని నిమిషాలకే భర్త తుదిశ్వాస విడిచిన సంఘటన అందరినీ కలచివేసింది.

12/02/2016 - 23:49

మిరుదొడ్డి, డిసెంబర్ 2: మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారు లొంగిపోయి జనజీవన స్రవంతి కలిసిపోతే పునరావసం కల్పిస్తామని డిఐజి అకున్ సబర్వాల్ అన్నారు. శుక్రవారంనాడు మండల పరిధిలోని భూంపల్లి గ్రామానికి చెందిన తండ్రి బాలక్రిష్ణరెడ్డి, తల్లి సులోచనల కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. మావోయిస్టులో పనిచేస్తున్న కుమారుడు జలందర్‌రెడ్డి లోంగిపోయో విధంగా కృషి చేయలన్నారు.

12/02/2016 - 23:49

పటన్‌చెరు, డిసెంబర్ 2: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్‌రాజ్ కన్నన్ స్పష్టం చేసారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా పనులు వేగవంతం చేస్తామని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి మండలంలో పర్యటించారు.

12/02/2016 - 23:48

మెదక్, డిసెంబర్ 2: పెద్దనోట్ల ఉపసంహరణ నేపథ్యంలో భాగంగా ప్రజలను నగదు రహిత లావాదేవిల దిశగా నడిపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులు, వివిధ బ్యాంక్ అధికారులతో సమావేశమై నగదు రహిత ఆర్దిక వ్యవస్థపై ప్రజలకు విస్తృతంగా అవగాహన చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

12/02/2016 - 23:48

జోగిపేట, డిసెంబర్ 2: అందోల్ మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామశివారులో శుక్రవారం బైక్ లారీ ఢీకొన్న సంఘటనలో సాయిలు (45) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సాయిలు బ్యాంక్ పనుల నిమిత్తం సంగారెడ్డి జిల్లా జోగిపేటకు వస్తుండగా మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Pages