S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 23:40

ఆదిలాబాద్, డిసెంబర్ 2: బిసి తెగల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ ముదిరాజ్‌ల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, కొత్తగా ఏర్పాటు చేసిన బిసి కమిషన్ ద్వారా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు, అసమానతలు తొలగించేందుకు అధ్యయనం చేయనున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.

12/02/2016 - 23:39

కౌటాల, డిసెంబర్ 2: పేదలకు వైద్య సేవలందించి సర్కారు వైద్యంపై భరోసా కల్పించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది విధులు విస్మరించి ప్రైవేటు క్లినిక్‌లను నిర్వహించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం, ఇదే తరుణంలో సర్కారు వైద్యం అందక పేదలు అవస్థలు పడుతున్న వైనంపై కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ సీరియస్‌గా స్పందించారు.

12/02/2016 - 23:39

ఆదిలాబాద్, డిసెంబర్ 2: సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ఎన్నికల ప్రలోభాలకు సంబంధించిన కేసును శుక్రవారం ఆదిలాబాద్ పిసిఆర్ కోర్టు మెజిస్ట్రేట్ భారతి ఎర్ర కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.

12/02/2016 - 23:38

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ఆదిలాబాద్ జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే పెన్‌గంగా బ్యారేజి నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెనాకకోర్ట కాలువల నిర్మాణం, బ్యారేజీల విషయంలో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సంధర్భంగా హెచ్చరించారు.

12/02/2016 - 23:38

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ఆర్థిక స్థోమత లేని పేదింటి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందని, ఆడ పిల్లల పెళ్ళిళ్ల కోసం తెల్లరేషన్‌కార్డు ఉన్నవారందరికి రూ.51వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి రామన్న అన్నారు.

12/02/2016 - 23:37

ఆదిలాబాద్, డిసెంబర్ 2: ప్రతి పోలీసు కానిస్టేబుల్‌కు సాంకేతిక సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు వన్ జీబి డాటాకార్డుతో కూడిన సిమ్‌కార్డులను కూడా జారీ చేయనున్నట్లు వరంగల్‌జోన్ పోలీసు ఐజి వై.నాగిరెడ్డి తెలిపారు.

12/02/2016 - 23:36

నిర్మల్, డిసెంబర్ 2: మహిళలు, రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం పట్టణంలోని సోఫీనగర్‌లో గల పాలశీతలీకరణ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పాలను శీతలీకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు.

12/02/2016 - 23:23

గుంటూరు, డిసెంబర్ 2: రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఈ నెల 14వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాలశాఖ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. మిల్లర్లు, అధికారులతో చర్చించిన అనంతరం 37 కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

12/02/2016 - 23:23

గుంటూరు, డిసెంబర్ 2..బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందికాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రోడ్లు, భవనాలశాఖ అతిథిగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతోనే ప్రజలు అవస్థలు పడుతుంటే పులిమీద పుట్రలా మరో అస్త్రాన్ని సంధించడం భావ్యం కాదన్నారు. బంగారంపై కేంద్రం తీరు తేనెతుట్టపై రాయివేసిన చందంగా ఉందన్నారు.

12/02/2016 - 23:22

గుంటూరు, డిసెంబర్ 2: నగరంలో పాత నేరస్థుల కదలికలపై నిఘా వేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అర్బన్ అధికారులతో నేరనియంత్రణకు అనుసరించాల్సిన పద్ధతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో శిక్షపడి బయటకు వచ్చి నగరంలో సంచరిస్తున్న నేరస్థుల రికార్డులను తిరగేయాలని సూచించారు.

Pages