S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 00:04

రాజంపేట, డిసెంబర్ 2: వేంకటేశ్వరునిపై 32వేల సంకీర్తనార్చన చేసిన తొలి వాగ్గేయదారుడు, ద్రావిడాగమ సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధి కోసం జిల్లా వైకాపా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తూనే వస్తున్నారు.

12/03/2016 - 00:03

అనంతపురం, డిసెంబర్ 2 : జిల్లా పురోభివృద్ధి, దుర్భిక్ష నివారణకు వచ్చే ఏడాది నుంచి ఎన్ని నీళ్లైనా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. శుక్రవారం పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తొలుత రిజర్వాయర్ వద్ద గంగపూజ, సర్వమత ప్రార్థనలు చేసి నీటిని విడుదల చేశారు.

12/03/2016 - 00:00

హిందూపురం, డిసెంబర్ 2 : జిల్లా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆనాడే శ్రీకృష్ణదేవరాయలు జిల్లావ్యాప్తంగా ఎన్నో చెరువులు, కుంటలను నిర్మించారని.. ఆయన ఆశయాలను నీరుగార్చకుండా చెరువులన్నింటిలో నీరు నింపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం మడకశిరలో జరిగిన చంద్రన్న పసుపు, కుంకుమ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 ఏళ్లలో 16 సంవత్సరాలుగా కరవు పీడిస్తోందన్నారు.

12/02/2016 - 23:59

పెనుకొండ, నవంబర్ 2 : మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీఆర్ సాగర్‌గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ పేరును రిజర్వాయర్‌కు నామకరణం చేస్తున్నట్లు సిఎం ప్రకటించగానే సభలో పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలు, ఈలలు మోగాయి. శుక్రవారం మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

12/02/2016 - 23:58

అనంతపురం అర్బన్, నవంబర్ 2:శ్రమజీవులకు వేతనాల తిప్పలు రెండవరోజు తప్పలేదు. వేతనంతో కుటుంబాలను నెట్టుకొచ్చే ఉద్యోగులు గత నెలలో నగదు సమస్య నుంచి బయట పడ్డవారు. ఈనెల 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో డిశంబర్ 1న వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు తదితర వాటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

12/02/2016 - 23:58

మడకశిర, డిసెంబర్ 2 : త్వరలో నియోజకవర్గానికి బంగారు భవిష్యత్తు వస్తుందని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న అన్నారు. శుక్రవారం మడకశిరలో నిర్వహించిన చంద్రన్న పసుపు, కుంకుమ పథకం కింద ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ మడకశిర ప్రాంత భవిష్యత్తును మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నివిధాలా కృషి చేస్తున్నారన్నారు.

12/02/2016 - 23:58

సోమందేపల్లి, డిసెంబర్ 2 : మండలంలోని పాపిరెడ్డిపల్లి చెరువులో వ్యక్తి శవమై తేలిన ఘటన శుక్రవారం జరిగింది. సోమందేపల్లికి చెందిన దూదేకుల ఇమాంసాబ్ (45) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులకు కనబడి తిరిగి అదృశ్యమయ్యాడు.

12/02/2016 - 23:56

సూర్యాపేట, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1000నోట్లను రద్దుచేసిన నేపథ్యంలో తమ ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రజలు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. మండలపరిధిలోని బాలెంల గ్రామంలో గ్రామపంచాయితీ ఆవరణలో డిజిటల్ పైనాన్సియల్ లిటరసి ప్రోగ్రాం నిర్వహించారు.

12/02/2016 - 23:55

నల్లగొండ, డిసెంబర్ 2: ఆర్‌బిఐ చెప్పినట్లుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల బ్యాంకులకు శుక్రవారం కూడా 150కోట్ల కరెన్సీ అందలేదు. దీంతో తమ వద్ధ ఉన్న 20కోట్ల మేరకు డబ్బులను వేతనాలకు, పింఛన్లకు, ఇతర ఖాతాదారులకు బ్యాంకర్ల సర్ధుబాటు చేశారు.

12/02/2016 - 23:55

నల్లగొండ, డిసెంబర్ 2: కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజకీయ పార్టీలు నూతన జిల్లా కమిటీలను, జిల్లా పార్టీల సారధులను నియమించుకునే ప్రక్రియను పూర్తి చేసుకుంటుండగా అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు మాత్రం తాత్సర్యం చేస్తున్నాయి.

Pages