S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 23:47

సిద్దిపేట టౌన్, డిసెంబర్ 2: ఆపదలో ఉన్న వారికి, అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి సిఎం సహాయ నిధి ఆపన్నహస్తంగా అందిస్తున్నామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో శుక్రవారం నియోజకవ్గంలోని 23మందికి 7.68లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

12/02/2016 - 23:46

లింగాల, డిసెంబర్ 2: విద్యాభివృద్దితోనే సమాజం పురోభివృద్ది చెంది బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం లింగాలలో 36లక్షల వ్యయంతో నిర్మించిన హైస్కూల్ అదనపు భవనాన్ని, రూ.1.15కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను, ఐదుకోట్ల వ్యయంతో నిర్మించిన సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు.

12/02/2016 - 23:45

మక్తల్, డిసెంబర్ 2: గత 25 రోజులుగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నప్పటికి వారి చేతికి మాత్రం సరైన డబ్బు అందలేక పోతుండటం, తగిన చిల్లర డబ్బులు లేకపోవడం, రూ.2000 పెద్దనోటుతో పరేషాన్ అవుతూనే ఉన్నారు. అంతలోపే డిసెంబర్ 1వ తారీకు రానే వచ్చింది. తమకు వేతనాలు వస్తాయని భావించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది.

12/02/2016 - 23:45

మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 2: భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైతు ప్రయోజనాల కోసం తక్కువ ప్రిమియంతో అధిక భీమా మొత్తం రైతులు పొందడానికి పంటల భీమా పథకం రైతులు సక్రమంగా వినియోగించుకోవడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు.

12/02/2016 - 23:44

వనపర్తి, డిసెంబర్ 2: వనపర్తి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి శుక్రవారం తెలిపారు.

12/02/2016 - 23:44

కొత్తకోట, డిసెంబర్2: వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం డి ఆర్ ఎం అరుణ్‌సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేస్తుండగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ప్రయాణికులకు మరుగుదొడ్లు సరిగ్గా లేవని, రెండవ ఫ్లాట్ ఫారంపై పైపుకప్పు సరిగ్గా లేదని దీంతో ఎండకాలం, వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే ఇట్టి సమస్యను తీరుస్తానని ఆమె హామి ఇచ్చారు.

12/02/2016 - 23:43

తిమ్మాజిపేట, డిసెంబర్ 2: వట్టెం రిజర్వాయర్‌లో భూములు కోల్పొతున్న పోతిరెడ్డిపల్లి గ్రామ రైతులకు న్యాయం చేస్తామని, రెండునెలల్లో పరిహారం చెల్లిస్తామని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెంకయ్యపల్లి గ్రామ శివారులో గల బిజిఆర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో భూములు కోల్పొతున్న రైతులతో సమావేశమయ్యారు.

12/02/2016 - 23:43

మహబూబ్‌నగర్, డిసెంబర్ 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని టిఆర్‌ఎస్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన నగదు రహిత లావాదేవీల అవగాహన సదస్సుకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలతో పాటు వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

12/02/2016 - 23:42

గద్వాల, డిసెంబర్ 2: ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా అవిభక్త పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేద్దామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలభవన్‌లో జూరాల ప్రాజెక్టు సాగునీటి సలహాబోర్డు సమావేశం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైని అధ్యక్షతన జరిగింది.

12/02/2016 - 23:41

నిర్మల్, డిసెంబర్ 2: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో 15 రోజులపాటు పొడగించడం జరిగిందని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు లోలంశ్యాంసుందర్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో సభ్యత్వ నమోదు తక్కువగా జరిగిందని, దీనిని పెంచాలని నాయకులకు సూచించారు.

Pages