S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 23:22

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 2: రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైసిపికి ఒక విధానమంటూ లేదని, దీనిపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/02/2016 - 23:21

గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే వరకు ప్రజా పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన మహాధర్నాకు జిల్లా పార్టీ సెక్రటేరియట్ సభ్యులు జెవి రాఘవులు అధ్యక్షత వహించారు.

12/02/2016 - 23:21

సతైనపల్లి, డిసెంబర్ 2: సత్తెనపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తలపెట్టిన అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తున్నామన్నారు. అవసరమైన అభివృద్ధి పనులన్నిటికీ శంఖుస్ధాపనలు చేస్తున్నామన్నారు. ‘చెప్పండి మీ గ్రామానికి ఇంకా ఏమికావాలి’ అని ప్రజలను ప్రశ్నించారు.

12/02/2016 - 23:20

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 2: సిపిఐ సీనియర్ నేత జివి కృష్ణారావు అంతిమయాత్ర శుక్రవారం స్థానిక సంగడిగుంటలోని జివి స్వగృహం నుండి ఏటుకూరు రోడ్డులోని హిందూ శ్మశానవాటిక వరకు జరిగింది.

12/02/2016 - 23:20

నరసరావుపేట, డిసెంబర్ 2: డైట్, డిఈడీ అంతర్ కళాశాలల యువజనోత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రొఫెసర్ యంవీ రాజ్యలక్ష్మి అన్నారు.

12/02/2016 - 23:18

ఖమ్మం, డిసెంబర్ 2: జిల్లాలో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు అవగాహన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల అమలును గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

12/02/2016 - 23:18

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దుతో రైతులు, కూలీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలపై ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ అనాలోచిత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రైతాంగం కుదేలైందన్నారు.

12/02/2016 - 23:17

మధిర, డిసెంబర్ 2: మధిర రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులపై దక్షిణ మధ్య డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశిష్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర రైల్వే స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రైల్వే క్రాసింగ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మధిర 1వ నెంబరు, 2వ నెంబరు ప్లాట్‌ఫారాలపై పారిశుద్ధ్య పనులు ఎంత మంది చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

12/02/2016 - 23:17

భద్రాచలం, డిసెంబర్ 2: భద్రాచలం మన్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తత కొనసాగుతోంది. మావోయిస్టుల పిఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మన్యంలో జనజీవనం స్తంభించింది. మావోయిస్టు దండకారణ్యంకు అతి సమీపంలో ఉన్న భద్రాచలం డివిజన్ సరిహద్దున ఏ సంఘటన జరిగినా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టుల ఆర్ధిక లావాదేవీలు, ఇతర కార్యక్రమాలకు సరిహద్దు గ్రామాలు రాచమార్గాలుగా మారాయి.

12/02/2016 - 23:16

వైరా, డిసెంబర్ 2: నల్లధనం మాటేమిటోగాని పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు, వృద్ధులకు బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఉదయం 9గంటల సమయానికే పెన్షన్లకోసం, జీతాలకోసం పలురకాల అవసరాలకోసం ముఖ్యంగా వృద్ధులు బ్యాంకులవద్ద వేచీ చూస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు కూడా బ్యాంకు తెరుచుకున్న గంట వరకు మాత్రమే రూ. 10వేలు ఇస్తున్నారు. ఆతరువాత సరిపడా నగదు లేక రూ. 5వేలు, లేక రూ.

Pages