S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 23:04

హైదరాబాద్‌లో శుక్రవారం మరో ఇద్దరు నైజీరియా దేశస్థులు పట్టుబడడం విస్తరించిపోతున్న ‘మాదక’ బీభత్స చర్యలకు సరికొత్త నిదర్శనం. అంతర్జాతీయ విమానాశ్రయాలు పెరుగుతున్న కొద్దీ అంతర్జాతీయ మాదక విక్రేతల సంఖ్య పెరుగుతుండడం సమాంతర పరిణామం! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ‘మాదకం మనుషులు’ తరచూ పట్టుబడుతూనే ఉన్నారు.

12/02/2016 - 23:01

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశాన్ని సుభిక్షంగా, స్వాభిమానంగా తీర్చిదిద్దాలని మనం భావించాం. ఎనె్నన్నో కలలు కన్నాం. కానీ, బాధాకరమైన విషయం ఏమంటే ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అవి నెరవేరలేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అనుకున్నాం.

12/02/2016 - 23:00

పగవారికి కూడా రాకూడదని భావించే అంగవైకల్యంతో కూడుకున్న వారి బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో 740 కోట్ల మంది ప్రజలుంటే వారిలో వంద కోట్లమంది ఏదో ఒక శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారేనని ఐక్యరాజ్యసమితి తేల్చింది. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరు వైకల్య బాధితులే. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి వెల్లడించే గణాంకాలు ఎవరికైనా దిగ్భ్రాంతిని కలిగిస్తాయి.

12/02/2016 - 22:55

500, 1,000 రూపాయల కారణంగానే దేశంలో కొంతమంది నల్లధనాన్ని విపరీతంగా పోగు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసంతో కూడినది. పెద్దనోట్లను పేదలు ఎప్పుడూ దాచుకోలేరు. వారి వద్ద నల్లధనం ఉండే అవకాశం లేనే లేదు. పాతనోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది గనుక భయాలు అనవసరం. భారీగా నోట్లను నిల్వ చేసుకునే వారికే ఆందోళన ఎక్కువ.

12/02/2016 - 22:54

కాంగ్రెస్ హయాంలో విశృంఖలంగా పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా 2011లో ఓ వైపు అన్నాహజారే నేతృత్వంలో, మరోవైపు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో భారీగా జరిగిన ఉద్యమాలతో ప్రజలు ఎంతగానో మమేకం అయ్యారు. ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు, సదస్సులు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

12/02/2016 - 22:45

‘‘డాడీ.. డాడీ.. ఈ రోజు మా స్కూల్‌లో ఓ కొత్త కాంపిటీషన్ పెట్టారు తెలుసా?’’
ఆ రోజే ఆఫీసులో ఇంక్రిమెంట్ అందుకున్న ఆనందంలో సాయంత్రం ఇంట్లోకి అడుగుపెట్టిన వెంకట్రావుతో అన్నారు.. అతని పుత్ర, పుత్రికారత్నాలు. ఈలోగా కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది కామేశ్వరి.

12/02/2016 - 22:43

జామకాయంటే అందరికీ చాలా ఇష్టం. తీపి, వగరు, పులుపు మూడు రుచుల మేలైన కలయిక జామకాయ. చిన్నారులనుండి పెద్దలవరకూ జామకాయంటే ఇష్టపడి తింటారు.
జామకాయలోనూ, జామపండులోనూ పోషక విలువలు మెండుగా వున్నాయి. జామకాయ పచ్చిదే తింటారు చాలామంది. మిగతా పండ్లకంటే విటమిన్ సి,ఇనుము అధికంగా వున్నాయి.

12/02/2016 - 22:40

‘ఆలుమగల కలహాలు అద్దంమీద ఆవగింజలు’ అన్నమాటలకు అర్థం లేకుండా పోయంది. ఇపుడు అవి ఫ్యామిలీ కోర్టులకు ఎక్కి విడాకుల పరిష్కారాన్ని చూపుతున్నాయి. అంతేకాదు, టీవీ చానళ్లకెక్కి సినిమా గిరాకీ లేని హీరోయిన్ల చేతిలో పడి ఏడుపులు, పెడబొబ్బలు.. దిక్కుమాలిన కౌన్సిలింగ్‌లతో వివాహ వ్యవస్థను రచ్చ రచ్చ చేస్తున్నాయి.

12/02/2016 - 21:55

వారి తీరే వేరు
(వ్యంజకాల సంపుటి)
-పొత్తూరి సుబ్బారావు
వెల: రూ.100/-
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**

12/02/2016 - 21:53

డాక్టర్ కె.వి.
రమణాచారి
-సాంస్కృతికోద్యమదృక్పథం
రచన: డాక్టర్ సావిత్రీసాయి
వెల: వంద రూపాయలు
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు
**

Pages