S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 22:39

జమ్మూకశ్మీర్‌లోని యూరీ ప్రాంతంలోని భారత సైనిక స్థావరాలపై జేష మహమ్మద్ ఉగ్రవాదులు దాడిచేసి 18 మంది భారత సైనికులను చంపేయడమే కాకుండా మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. పఠాన్‌కోటపై దాడి జరిగినప్పుడే ఇండియా కఠినంగా వ్యవహరించని ఫలితమే యూరీ స్థావరంపై దాడి అని చెప్పాలి. ఒక్క సిపిఎం తప్ప తక్కిన ప్రతిపక్షాలన్నీ నరేంద్రమోదీ ఏ చర్య తీసుకున్నా తాము బలపరుస్తామని ప్రకటించాయి.

09/22/2016 - 22:38

ప్రపంచంలో 50 శాతం మందికి, భారతదేశంలో 70 శాతం మందికి, తెలుగు రాష్ట్రాలలో అయితే 85 శాతం మందికి ప్రధాన ఆహార ధాన్యం బియ్యమే. ఈ బియ్యం తయారీకి ముడి పదార్థమైన వరిని పండిస్తేనే సరికాదు. దానిని సక్రమంగా మరపట్టి బియ్యంగా మా ర్చాలి. ఈ క్రతువులో బియ్యం మిల్లులదే అగ్రస్థానం. ఒకప్పుడు బియ్యం మిల్లుల యజమానులు తలఎగరేసుకుని తిరిగేవారు.

09/22/2016 - 22:36

చెట్టుముందా లేక విత్తనమా, కోడి ముందా లేక గుడ్డా అని ప్రశ్నిస్తే ఎంతటి పండితుడైనా సరియైన జవాబు చెప్పలేడు. సరిగ్గా ఇలాం టి చిక్కు సమస్యనే నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. దేశం లో ఇతర ప్రాంతాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు నక్సల్ ప్రభావిత క్షేత్రాలలో చేపట్టకపోవడంవల్లనే నక్సల్స్ విస్తరిస్తున్నారు, విజృంభిస్తున్నారు. రక్తపాతం జరుగుతున్నదనేది సత్యం.

09/22/2016 - 22:35

తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికేనా పుష్కరాలకు అంత హడావిడి చేశారు. గత పుష్కరాల్లో ఎటువంటి ఆర్భాటం లేకుండా కనీసం స్నాన ఘట్టాల వద్ద ఒక్క పోలీసు కూడ కాపలాగా లేడని లీలామాత్రంగా గుర్తు. ప్రజలకు పుష్కరం గురించి తెలియదా?! పుష్కరాల సందర్భంగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానించటం దేనికి? దేవుని కార్యానికి అందరూ పెద్దలే కదా!

09/22/2016 - 22:30

ముద్దు మనిషి జీవితంలో ఓ మధుర స్పర్శ.. మమతల శ్వాస. ఓసారి ఆప్యాయంగా, ఓపరి ఓదార్పుగా, ఓ పర్యాయం ఆనందంగా.. లాలనగా, కాంక్షగా, తమకంగా, తృప్తిగా.. ఇన్ని మధుర భావాల వ్యక్తీకరణకు సాధనమైన మరి ముద్దైన పద్ధతులేంటో తెలుసా మీకు? అయతే తెలుసుకోండి.

09/22/2016 - 22:26

పాత దుస్తులుంటే మనమేమి చేస్తాం. మూటగట్టి అటకెక్కిస్తాం. లేదంటే పారేస్తాం. కాని హంసిని హరన్ మాత్రం వాటితో ఇంటిని అందంగా అలంకరిస్తోంది. కుషన్ కర్టెన్లు మొదలుకుని కీ చెయిన్ల వరకు పాత దుస్తులతోనే అందంగా కొత్తవి తయారుచేసి వ్యాపారం చేస్తోంది. కళాత్మక వస్తువులకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు ప్లాస్టిక్ వస్తువులను పారేయకుండా ఫ్లవర్‌వేజ్‌లాంటివి తయారుచేస్తుంటే..

09/22/2016 - 22:23

కాయగూరలలో పొడుగ్గా వుండే పొట్లకాయలో పోషక పదార్థాలు లభిస్తాయి. ఇందులో నీరు అత్యధికంగా లభిస్తుంది. స్వల్పంగా కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, గంథకం, ఇనుము, ఆగ్జాలికామ్లం, స్వల్పంగా ధయామిన్, రిబోప్లోవిన్, అధికంగా కెరోటిన్ లభిస్తాయి పొట్లకాయలో. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. ఆరోగ్యానికి మేలు చేసేవే.

09/22/2016 - 22:20

‘‘అగ్గిపుల్ల భగ్గుమంటుంది’’...
చంటిపిల్లాడికి ఈ సంగతి తెలుసు..
అయినా ఆ విషయాన్ని ‘లైట్’గా తీసుకున్నాడు- డేమిడ్ మ్యాచ్.
ఆయన క్రియేటివిటీ ముందు మనలోని సృజనాత్మకత దివిటీ ముందు
అగ్గిపుల్లే!..
డేవిడ్ మ్యాచ్- మ్యాచ్‌స్టిక్ హెడ్స్‌తో చేసిన బొమ్మలు చూస్తే
మన హెడ్స్ అవే తలకాయలు గిర్రున తిరగాల్సిందే.

09/22/2016 - 22:18

రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

09/22/2016 - 22:13

ఫోటోలో మీరు చూస్తున్నది సోలార్ సన్ ట్రీ. చెక్కతో తయారు చేసిన ఈ బుల్లి చెట్టుపై కనిపిస్తున్నవి సోలార్ పేనల్స్. ఈ తొమ్మిది సోలార్ పేనల్స్‌తో మొబైల్ ఫోన్, ఎంపి3 ప్లేయర్ వంటి తొమ్మిది గాడ్జెట్లను ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. కిటికీలో సూర్యకాంతి పడేచోట దీనిని ఉంచితే, ఇంటీరియర్ డిజైన్‌లో ఓ భాగమవుతుంది. చార్జర్‌గానూ ఉపయోగపడుతుంది. ధర 119 డాలర్లు.

Pages