S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 02:06

హైదరాబాద్, బేగంపేట, జూన్ 17: ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నేషనల్ ఉమెన్ పాలసీ 2016’ పై ఈ నెల 22న సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ డా. త్రిపురాన వెంకటరత్నం వెల్లడించారు.

06/18/2016 - 02:04

జీడిమెట్ల, జూన్ 17: అవగాహన లేని ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌ల నిర్లక్ష్యంతో చిన్నపిల్లలు బలవుతున్నారు. ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ బాలుడు దుర్మరణం పాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

06/18/2016 - 02:03

జీడిమెట్ల, జూన్ 17: ఆంధ్రాబ్యాంక్‌లో దొంగలు చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సుచిత్ర, వెనె్నలగడ్డలోని సెయింట్ ఆంథోని స్కూల్ భవనంలోని ఆంధ్రాబ్యాంక్ జీడిమెట్ల బ్రాంచ్ కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 నుండి 4 గంటల మధ్యలో ముగ్గురు దుండగులు షట్టర్ తాళాలను పగులగొట్టి బ్యాంక్ లోపలికి ప్రవేశించారు.

06/18/2016 - 02:02

హైదరాబాద్, జూన్ 17: తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థి వ్యతిరేక పోకడలను అవలంబిస్తున్నారని శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయ ఆవరణలో కొంతమంది విద్యార్థులు వైస్ చాన్సలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాటలు పాడారు. ఎంఫిల్, పిహెచ్‌డి నోటిఫికేషన్ ఇవ్వాలని నినాదాలు చేసారు. ఈ విషయమై వర్సిటీ ఉపాధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డిని వివరణ అడుగగా, అనవసర రాద్ధాంతం అంటూ తోసిపుచ్చారు.

06/18/2016 - 02:01

మేడ్చల్, జూన్ 17: యోగ ఆరోగ్య వరప్రదాయిని అని నిత్య యోగాతో చాలా రోగాలు దరి చేరకుండా ఉంటాయని యోగ శిక్షకులు యశ్‌పాల్ ఆర్య అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ గురువు రామ్‌దేవ్ బాబ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని లక్ష్మమ్మ స్మారక విద్యానిలయంలో ఐదు రోజుల యోగ శిక్షణా తరగతుల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు యోగ శిక్షణ తరగతులను ఆర్య ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

06/18/2016 - 02:01

మేడ్చల్, జూన్ 17: అఖిల భారత మార్వాడీ యువమంచ్ మేడ్చల్ శాఖ వారి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ పౌర ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరానికి ప్రజల నుంచి అనుహ్యమైన స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.

06/18/2016 - 02:00

కీసర, జూన్ 17: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మల్కాజ్‌గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం దమ్మాయిగూడ గ్రామంలోని తిరుమల, సాయి తిరుమల ఎన్‌క్లేవ్ కాలనీలో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.

06/18/2016 - 01:59

అల్వాల్, జూన్ 17: అందరికీ అందుబాటులో కంటోనె్మంట్ జనర్ ఆసుపత్రి ఉంటుందనీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఐదు కోట్ల రూపాలతో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రిని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కెటి రామరావుతో కలిసి ప్రారంభించారు.

06/18/2016 - 01:58

చాంద్రాయణగుట్ట, జూన్ 17: హైదరాబాద్ నగరం అమెరికన్ ఫుట్‌బాల్ అంతర్జాతీయ మ్యాచ్‌కి వేదిక కానుంది. అమెరికన్ ఫుట్‌బాల్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఫ్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడా వ్యాప్తి కోసం భాతర ధేశంలోని పలు నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను దేశ నలుములలో అండర్-15, 19 విభాగం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను నిర్వహిస్తోంది.

06/18/2016 - 01:58

ఘట్‌కేసర్, జూన్ 17: నకిలీ రశీదులు ఇచ్చి అవినీతి పాల్పడుతున్న బిల్‌కలెక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ కోరారు. కలెక్టర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సర్పంచ్ యాదగిరియాదవ్ వివరాలు తెలిపారు.

Pages