S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 20:44

యువ భారత
నవ తరమా...
మేలుకో ఏలుకో
ఇదేరా!
ఎన్నికల సమరం
మీకిదే
సమయం
దేశానికి శక్తి మీరు
భారత జాతికి
వనె్న మీరు
ప్రజాస్వామ్య భారతంలో
మీ స్థానం
ఎక్కడుంది?
నవ భారత
యువతరమా..
నా దేశ
సౌభాగ్యమా
మీ గమ్యం ఎటువైపు
మీ తీర్పు
ఒక మార్పు
మీ తీర్పు కావాలి
ఓ మార్పు.. రావాలి

05/29/2016 - 20:31

కాళ్లు లేనివారు బీదవాళ్లైతే ఊత కర్రల సాయంతో నడుస్తారు. ధనవంతులైతే వీల్ చైర్‌ని వాడతారు. లయన్స్ క్లబ్స్ లాంటి సంస్థలు బీదలకి వీల్ చైర్స్‌ని విరాళంగా కూడా ఇస్తూంటాయి. సాధారణంగా కాళ్లు లేని వాళ్లు చక్రాల కుర్చీని ఇంట్లో తిరగటానికే ఉపయోగిస్తూంటారు. కాని చైనాలోని బీజింగ్‌కి చెందిన క్వాన్ పెంగ్ అనే కుంటి వ్యక్తి చక్రాల కుర్చీని ఇంట్లోనే కాక ఇంటి బయట దీర్ఘ ప్రయాణానికి కూడా ఉపయోగిస్తున్నాడు!

05/29/2016 - 20:03

న్యూదిల్లి:కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌లకు రాజ్యసభకు పంపేందుకు మరోసారి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బిజెపి అధిష్టానం వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో వారి పేర్లున్నాయి. కాకపోతే గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలనుంచి ఈసారి వారు పోటీ చేయడం లేదు. వెంకయ్య గతంలో కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు రాజస్థాన్‌నుంచి రంగంలోకి దిగుతున్నారు.

05/29/2016 - 20:02

హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, భవిష్యత్‌లో బిజెపికే భవిష్యత్ ఉందని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. బిజెఎల్‌పి నేతగా ఎన్నికైన కిషన్‌రెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎం ఎదిగితే దేశానికి నష్టమని వ్యాఖ్యానించిన కిషన్‌రెడ్డి పార్టీ పటిష్టతకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

05/29/2016 - 20:02

హైదరాబాద్:తెలంగాణలో 2019 ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా అవతరిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్‌డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదనలేవీ లేవని, వచ్చినపుడు పరిశీలిస్తామని అన్నారు.

05/29/2016 - 17:32

తిరుపతి:రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, అందుకోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో మహానాడు మూడోరోజు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటివరకు 28 తీర్మానాలకు ఆమోదం లభించిందని, వెయ్యిమంది వలంటీర్లు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మహానాడును దిగ్విజయం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

05/29/2016 - 17:32

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేస్తామని, మిత్రపక్షంగా కొనసాగుతామని చెప్పిన ఆయన ప్రత్యేకహోదా అంశం పరిశీలిస్తున్నామన్నారు.

05/29/2016 - 17:20

దావణగెరె:కేంద్రంలోని తన ప్రభుత్వం పేదలకోసమే పనిచేస్తుందని, ఏసీ రూముల్లో కూర్చుని సలహాలు ఇచ్చేవారికోసం పనిచేయదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కర్నాటకలోని దావణగెరెలో ఆదివారం నిర్వహించిన ‘వికాస్ ర్యాలీ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వారంలోనే తానేం చేశానంటూ ప్రశ్నించినవారు ఉన్నారని ఆయన అన్నారు.

05/29/2016 - 17:20

న్యూదిల్లి:రాజధాని నగరం దిల్లీలో ఆరుగురు ఆఫ్రికన్లపై దాడికి పాల్పడిన సంఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఫోన్‌లో చర్చించారు.

05/29/2016 - 17:19

లూథియానా:పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ మనుమడు హరింత్‌సింగ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కణతపై బుల్లెట్ గాయాలున్నాయి. చండీగఢ్‌లోని తన ఇంట్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Pages