S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 21:47

విజయవాడ, మే 28: పుష్కర పనుల్లో సాకులు చూపి పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుండి శనివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ఆయన కృష్ణలంక బైపాస్ రోడ్డు పనులతోపాటు సీతమ్మ పాదాల నుండి బెరమ్‌పార్క్ వరకు జరుగుతున్న పుష్కర ఘాట్ల పనులను ఇంజనీర్లు, సోమా ప్రతినిధులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

05/29/2016 - 21:45

కూచిపూడి, మే 28: వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన దాడుల కారణంగా కృష్ణాజిల్లా సారా రహిత జిల్లాగా గుర్తింపు పొందిందని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎస్ వెంకట శివప్రసాద్ పేర్కొన్నారు. మొవ్వ సర్కిల్ స్టేషన్‌ను శనివారం ఆయన పరిశీలించారు.

05/29/2016 - 21:44

చల్లపల్లి, మే 28: ఓ షాపు విషయమై లీజు దారునికి, సబ్ లీజు దారునికి మధ్య తలెత్తిన వివాదంతో శనివారం తెల్లవారు జాము నుండి చల్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

05/29/2016 - 21:43

తోట్లవల్లూరు, మే 28: తోట్లవల్లూరులో శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని కళ్ళంవారిపాలెం జడ్పీరోడ్డులో మూడు భారీ చెట్లు వేళ్ళతో సహా నేలకూలాయి. దీంతో రాకపొపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెట్ల తొలగింపుని చేపట్టారు. అలాగే కళ్ళంవారిపాలెం దళితవాడలో తూమాటి రమణకు చెందిన రేకుల షెడ్డు ధ్వంసం అయ్యింది.

05/29/2016 - 21:39

సికింద్రాబాద్, మే 28: ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని కొనియాడారు. ఇందులో భాగంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు నల్లెల కిశోర్ తదితరులు హాజరయ్యారు.

05/29/2016 - 21:39

షాబాద్, మే 28: రైతులను తెలంగాణ ప్రభుత్వం నిలువెత్తునా మోసం చేస్తున్నదని బిసి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. అరుణ్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని నరెడ్లగూడలోని రైతుల పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు ఎలాంటి మంచి పనులు చేయలేదని పేర్కోన్నారు. మండలంలో 70 శాతం మంది రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు.

05/29/2016 - 21:37

హైదరాబాద్, మే 28: ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణను ఘనంగా సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జస్టిస్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ, కోడి రామకృష్ణతో సాంస్కృతిక సంబంధం వుందని, ఇరువురం నర్సాపురంకు చెందినవాళ్లమని, ఏ ప్రాంతంలో వున్నా సాంస్కృతిక సంస్థలు కళాభిమానులను ఒక చోటుకి చేరుస్తున్నాయని అన్నారు.

05/29/2016 - 21:36

హైదరాబాద్, మే 28: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుద్ద్యం కార్మికుల వివరాలు ప్రజలకు మరింత సమర్థవంతమైంగా సేవలందిస్తూ నగరం ‘స్వచ్ఛ హైదరాబాద్’ దిశగా అడుగులు వేస్తోందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఘన వ్యర్థాల నియంత్రణ విభాగం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను మేయర్ శనివారం ప్రారంభించారు.

05/29/2016 - 21:35

హైదరాబాద్, మే 28: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి సరఫరా చేస్తున్న జలమండలి ప్రజల అవసరాల నిమిత్తం స్వచ్ఛమైన నీటిని రూ.1కి అందించేందుకు ఎనీటైమ్ వాటర్ కియోస్క్‌లను పైలట్ ప్రాజెక్ట్ కింద నగరంలోని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు.

05/29/2016 - 21:34

హైదరాబాద్, మే 28: భాగ్యనగరంలో త్వరలోనే డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మహానగర పాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. తొలి దశగా వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోని 28 మురికివాడలకు చెందిన పదివేల మందికి ఈ అంశంపై నెలరోజుల పాటు శిక్షణనివ్వనున్నట్లు కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి తెలిపారు.

Pages