S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 05:13

న్యూఢిల్లీ, మే 28: మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను కాంగ్రెస్ పార్టీ మహారాష్టన్రుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ 8 మంది అభ్యర్థులను శనివారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేశ్‌లను కర్నాటకనుంచి, కపిల్ సిబల్‌ను ఉత్తరప్రదేశ్‌నుంచి అభ్యర్థులుగా ఎంపిక చేసింది.

05/29/2016 - 05:13

న్యూఢిల్లీ, మే 28: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) శనివారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల్లో దేశవ్యాప్తంగా 1,68,541 మంది విద్యార్థులు 10 సిజిపిఎ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్) మార్కులు సాధించారు. వీరిలో బాలురు 85,316 మంది ఉండగా, బాలికలు 83,225 మంది ఉన్నారు.

05/29/2016 - 05:11

ఎం.ఎస్.సిలోకి వచ్చిన తరువాత అంటే, వరంగల్ చేరిన తరువాత అన్నమాట. కొత్త మిత్రులు వచ్చారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఒకతను తానింకా రైలు ఎక్కలేదని చెపితే నాకు పట్టరానంత ఆశ్చర్యం అయ్యింది. నేను మరి పాలమూరు నుంచి హైదరాబాద్ దాకా బస్సులో వచ్చినా, అక్కడి నుంచి మాత్రం కాజీపేటకు రైల్లో వచ్చినట్టున్నాను. పాలమూరు నుంచి పట్నం అనే హైదరాబాదుకు రైలు లేదని కాదు. ఆ రైలు సమయానికి మనం వెళ్లాలి.

05/29/2016 - 05:08

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
షిరిడీ సాయిబాబా భగవంతుడా? ఆయన భగవంతుడు కాదని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారన్నారని ఎవరో కోర్టు నాశ్రయించారు. దేముడా, కాదా అని కోర్టులు ఏ చట్టం ప్రకారం తీర్పునిస్తాయి?

05/29/2016 - 05:07

పుదుచ్చేరి, మే 28: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వి నారాయణస్వామి శనివారం పుదుచ్చేరి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన పుదుచ్చేరికి పదో ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమయింది.

05/29/2016 - 05:05

వాషింగ్టన్, మే 28: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లోని ముగ్గురు వ్యోమగాములతో ముఖాముఖి మాట్లాడతారు. ఫేస్‌బుక్ వినియోగదారులు నాసా ఫేస్‌బుక్ పేజీలో ఉంచిన ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబడతారు. ఎంతగానో ఆసక్తి రేకెత్తించే ఈ కార్యక్రమం జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రసారమవుతుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

05/29/2016 - 05:04

న్యూఢిల్లీ/ముంబై, మే 28: మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దేశమంతటా రైతులు కరవుతో అల్లాడుతుంటే ఇండియాగేట్ దగ్గర మోదీ సర్కారు పండుగ చేసుకుంటోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో విమర్శించారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి ఆగిపోయిందని..

05/29/2016 - 05:04

రియోడిజనీరో, మే 28: మహిళలపై లైంగిక దాడులకు పరాకాష్ఠ ఈ ఘటన. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో ఒక టీనేజీ బాలికపై 33 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారం వల్ల అచేతనంగా పడిపోయిన ఆ 16 సంవత్సరాల బాలిక మరునాడు స్పృహలోకి వచ్చినట్లు సమాచారం.

05/29/2016 - 05:03

వాషింగ్టన్, మే 28: అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వంపై పాకిస్తాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంపై అమెరికా స్పందించింది. ఇది అణ్వాయుధాల తయారీకి ఎంతమాత్రం కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్ స్పష్టం చేశారు. ‘అణ్వాయుధాల ఉత్పత్తికి లేదా పోటీకోసం కాదు. అణు ఇంధనాన్ని పౌర శాంతికోసం దోహదపడే ప్రక్రియ మాత్రమే. దీన్ని పాకిస్తాన్ ఆ కోణంలోనే చూడాలి’ అని స్పష్టం చేశారు.

05/29/2016 - 05:02

న్యూయార్క్, మే 28: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల ఐక్యరాజ్య సమితిలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 21న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Pages