S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/28/2016 - 22:42

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న సంస్థగా ఎదిగి, ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 41 ఏళ్ల అనురాగ్ ఠాకూర్ సంబరపడుతుండవచ్చు. కానీ, అతను సమస్య ఊబిలో కాలుమోపాడు. దాని నుంచి బయటపడతాడా లేక అందులో కూరుకుపోయి, ఏమీ చేయలేని స్థితిలో చిక్కుకుంటాడా అన్నది ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ అతను అధికారంలో ఉంటాడు.

05/28/2016 - 22:40

బ్రిస్బేన్, మే 19: టెస్టు మ్యాచ్‌లు పగలు జరుగుతాయి. వనే్డ, టి-20 ఫార్మెట్‌లో మ్యాచ్‌లు కూడా పగలు జరిగినా, ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు డే/నైట్ పోటీలుగానే ఉంటాయి. కానీ టెస్టు క్రికెట్‌లోనూ డే/నైట్ మ్యాచ్‌లు రంగ ప్రవేశం చేశాయి. దీనితో ప్రేక్షకుల కోసం ‘ట్వి లైట్’ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

05/28/2016 - 22:37

లాస్ ఏంజిల్స్, మే 9: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందన్న విమర్శలు ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రీడా రంగంలో ఇప్పటికే ప్రతిష్ట కోల్పోయిన రష్యా మరోసారి వివాదంలో చిక్కుకుంది. రష్యా డోపింగ్ నిరోధక విభాగం (రసడా) మాజీ అధికారి విటాలీ స్టెపనోవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోచీ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వారిలో నలుగురు డోపింగ్ దోషులేనంటూ సంచలన ప్రకటన చేశాడు.

05/28/2016 - 22:35

రోలాండ్ గారోస్ ఫ్రాన్స్‌లో సమర్థుడైన పైలట్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ సరిహద్దులో సేవలు అందించిన అతను మధ్యదరా సముద్రం మీదుగా విమానాన్ని నడిపిని తొలి ఫ్రెంచ్ పైలట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఆ సమయంలోనే అతను ఫ్రాన్స్ నుంచి జర్మనీకి దగ్గరిదారిని కనిపెట్టాడు. విమానానికి ఉండే ప్రొపెలర్స్‌ను ఉపయోగించి, మెషిన్ గన్స్‌ను వాడే విధానానికి శ్రీకారం చుట్టాడు.

05/28/2016 - 22:26

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్ రూపొందించిన చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 3న విడుదలకు సిద్ధం చేశారు.

05/28/2016 - 22:24

భారీ అంచనాల మధ్యన గత వారం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమా అంచనాలను అందుకోలేక, అభిమానులను సైతం నిరాశపరచడంతో మహేష్ ఇకపై చేయబోయే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సౌతిండియాలో పాపులర్ డైరెక్టర్ అయిన ఎ.ఆర్.మురగదాస్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన మహేష్, ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

05/28/2016 - 22:21

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. తన ప్రతి సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలతో సంచలనం క్రియేట్ చేసే ఇతగాడి బ్రాండ్‌కి బ్యాండ్ వేస్తుంది కుర్ర హీరోయిన్ ఆలియాభట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమానుండే లిప్‌లాక్ సన్నివేశాలు, బికినీ, రొమాంటిక్ సీన్స్‌తో అందరికీ షాక్ ఇచ్చింది.

05/28/2016 - 22:19

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ ఎంత ప్రత్యేకమైన సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన అభిమానులు ఎంతోకాలంపాటు ఎదురుచూసిన హిట్‌ని దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాతో అందించారు. అలాంటి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

05/28/2016 - 22:16

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందించిన చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేశారు.

05/28/2016 - 22:18

టాలీవుడ్‌లో ఇప్పుడు రాశీఖన్నా కెరీర్ యమజోరుమీదుంది. ఎవ్వరి నోటా విన్నా రాశీ కబుర్లే కబుర్లు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో యమక్రేజ్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టే భామలు మరెన్నో కలలుగనడం సర్వసాధారణం. అయితే అందరికీ అదృష్టం కలిసివస్తుందా? అంటే ఆలోచించాల్సిందే. కానీ రాశీఖన్నా విషయంలో మాత్రం అదృష్టం బాగానే కలిసి వస్తోంది.

Pages