S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 02:49

న్యూఢిల్లీ, మే 28: నల్లధన కుబేరులపై కఠిన చర్యలు తప్పవని మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ‘పనామా పేపర్లు’పై స్పందిస్తూ అక్రమార్జనపరులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని, వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనపై శనివారం ఇక్కడ ఇండియా గేట్ వద్ద ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ ‘పనామా కేసులో పేర్లున్నవారి ఖాతాల్లో నల్లధనం ఉన్నట్లు గుర్తిస్తే..

05/29/2016 - 02:46

శాఖపట్నం, మే 28: గృహనిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ అభిప్రాయపడ్డారు. విశాఖతో పాటు ప్రధాన పట్టణాల్లో గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

05/29/2016 - 02:35

బెంగళూరు, మే 28: తొమ్మిదో ఐపిఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి దీనిని ఇరు జట్ల మధ్యగాక, ఇరువురు కెప్టెన్ల మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించాల్సి ఉంటుంది.

05/29/2016 - 02:32

జాన్ జువాన్ (అర్జెంటీనా), మే 28: అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ గాయపడ్డాడు. వచ్చేనెల అమెరికాలో కోపా అమెరికా సెంటినరీ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ జరగనుండగా, అందులో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న మెస్సీ హోండురాస్‌తో జరిగిన ఒక వామప్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడిని బలంగా ఢీకొన్నాడు. కిందపడి, బాధతో అల్లాడుతున్న అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

05/29/2016 - 02:30

పారిస్, మే 28: తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మొదటి రెండు రౌండ్లలో అతను చేతి మణికట్టు గాయంతోనే మ్యాచ్‌లు ఆడాడు. చేతికి ఇంజక్షన్ చేయించుకొని మరీ అతను పదోసారి రొలాండ్ గారోస్‌లో టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ముందంజ వేశాడు.

05/29/2016 - 01:51

తిరుపతి, మే 28: ఏపి, తెలంగాణల్లో జలవనరుల వినియోగం, నీటి ప్రాజెక్టుల అంశాలపై విద్వేషాలతో వ్యవహరిస్తే ఇరు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు చెప్పారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మహానాడులో రెండవరోజైన శనివారం 11 తీర్మానాలను ఆమోదించారు.

05/29/2016 - 01:50

హైదరాబాద్, మే 28: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవమైనట్టే. తెలంగాణ, ఆంధ్ర రాజ్యసభ స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు ఈనెల 31 చివరి తేదీ. తెలంగాణలో రెండు స్థానాలుంటే, తెరాస వినా మరే పార్టీ పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో, ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తేలిపోయింది.

05/29/2016 - 01:46

నల్లగొండ / ఖమ్మం / వరంగల్, మే 28: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లాలో గాలివాన బీభత్సానికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. వరంగల్‌లో భారీ వృక్షాలు నేలమట్టం కాగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయ.

05/29/2016 - 01:44

హైదరాబాద్, మే 28: తెలంగాణతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. హాలీవుడ్ టాప్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంపిక చేసుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తన ఐదవ రోజు పర్యటనలో లాస్‌ఏంజిలిస్‌లో వివిధ సంస్థలను కలిశారు.

05/29/2016 - 01:41

హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్టవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వచ్చే ఆరు నెలల వ్యవధిలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించనున్నాయి. ఈ రంగంలో మొత్తం కొత్త ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని, సుమారు 72శాతం ఉద్యోగాలు పెరుగుతాయని టిఎంఐ నిర్వహించిన సర్వేలో తేలింది.

Pages