S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 04:58

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. దేశం విడిచి వెళ్లిపోకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వరంగ బ్యాంకర్ల పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. వేల కోట్ల రూపాయలు బకాయిపడి, దేశం విడిచి వెళ్లిపోయేందుకు చూస్తున్నారంటూ ఎస్‌బిఐసహా 13 బ్యాంకులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. బ్యాంకుల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి హాజరై ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

03/09/2016 - 04:58

న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాలను ఎగవేసిన వారిని రాజ్యసభ ఎంపికకు అనర్హులుగా ప్రకటిస్తూ సభలో ఒక తీర్మానం చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌తోపాటు పలువురు ఇతర సీనియర్ నాయకులు ఈ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

03/09/2016 - 04:57

న్యూఢిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌పై వచ్చిన నకిలీ వీడియోల వ్యవహారంపై దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక వచ్చిన తరువాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వి హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర సభ్యులు ఈ అంశంపై జరిపిన చర్చకు ఆయన జవాబిచ్చారు.

03/09/2016 - 04:44

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నిర్వహించిన తొలి రిక్రూట్‌మెంట్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది. 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (సివిల్) పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన పరీక్ష నిర్వహించింది. లిఖిత పరీక్షలో అర్హులకు గత ఫిబ్రవరి 8 నుండి 26 వరకూ ఇంటర్వ్యూలను నిర్వహించి 904 మంది అభ్యర్ధులను ఎంపిక చేశారు.

03/09/2016 - 04:43

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఫిలిప్ సి తోచర్ నియమితులయ్యారు. గుంటూరుకు చెందిన ఫిలిప్ సి తోచర్‌ను నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా తోచర్ గుంటూరు జిల్లా కన్నవారితోటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులుగా ఎవరినీ నామినేట్ చేయలేదు.

03/09/2016 - 02:31

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్వదేశీ నావిగేషన్ సేవలకు సంబంధించిన ఆరో ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వసిద్ధం చేశారు. శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ నెల 10న గురువారం సాయంత్రం 4గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

03/09/2016 - 02:27

హైదరాబాద: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం నాడు శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను ఎద్దేవా చేస్తూ విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. మహిళాదినోత్సవం అని చూడకుండా అబద్దాలు చెబుతున్నారని సిఎం ముందు తన మనసును రిపేరు చేసుకోవాలని , తర్వాత పార్టీని, వ్యవస్థను రిపేరు చేయడం మొదలుపెట్టాలని పేర్కొన్నారు.

03/09/2016 - 02:26

హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరినందున ఇక ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముంబయినుంచి హైదరాబాద్ చేరుకున్న కెసిఆర్ బృందానికి బేగంపేట విమానాశ్రయానికి తిరిగి వచ్చిన కెసిఆర్ బృందానికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

03/09/2016 - 02:25

న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాదిమంది ప్రభుత్వ,ప్రైవేట్ రంగం ఉద్యోగులు గట్టిగా వ్యతిరేకించటంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్)పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో తనంతట తానుగా ప్రకటన చేస్తూ ఇపిఎఫ్‌పై పన్ను విధించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

03/09/2016 - 02:24

కోజికోడ్: ముస్లిములలో మగవారు నలుగురు స్ర్తిలను వివాహం చేసుకునే వీలు ఉన్నప్పుడు ముస్లిం స్ర్తిలకు మాత్రం ఆ హక్కు ఎందుకుండకూడదని కేరళ హైకోర్టు న్యాయమూర్తి బి. కేమల్ పాషా ప్రశ్నించారు. ముస్లిం మహిళా ఫోరం ఆదివారం ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ సక్రమమైన జీవితం గడపాలంటే మగవాడయినా, స్ర్తి అయినా ఒకే భాగస్వామిని కలిగి ఉండాలన్నారు.

Pages