S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 06:19

నేరేడుచర్ల: సభ్యసమాజం తలదించుకునేలా ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిపిన వ్యక్తికి మహిళా దినోత్సవం రోజైన మంగళవారం నిర్భయ కేసు నమోదైంది.

03/09/2016 - 06:11

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం పెట్రేగిపోయారు. రాజ్‌నంద్‌గావ్ సారడా ఎనర్జీ సంస్థ ఏజీఎం శ్రీకుమార్ నాయర్‌ను కాల్చి చంపారు. సంస్థకు చెందిన 6 వాహనాలకు నిప్పు పెట్టారు. పల్లెమాడి ఎల్‌ఓఎస్ కమిటీకి చెందిన 15 నుంచి 20 మంది సాయుధ నక్సల్స్ సంస్థలోకి చొరబడి ముందుగా ఏజీఎంను కాల్చి చంపారు.

03/09/2016 - 06:10

విజయనగరం: పట్టణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు 14వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను జిల్లా పరిషత్ ద్వారా ఖర్చుచేయాలని ఆదేశించింది. 25 శాతం నిధులను మళ్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాపంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి.

03/09/2016 - 06:10

రాజమహేంద్రవరం: అర్బన్ ప్రాంతాల్లో అదుపులేని అనధికార నిర్మాణాలతో ముంచుకొస్తున్న ముంపు ప్రమాదాలను నివారించడానికి పురపాలక శాఖ ఒక సీజన్ ముందుగానే అప్రమత్తమయ్యింది. వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల ఏర్పడే ముంపు ప్రమాదాన్ని ముందుగానే ఎదుర్కోవడానికి పురపాలక శాఖ ప్రణాళికను సిద్ధంచేస్తోంది.

03/09/2016 - 06:12

విశాఖపట్నం, మార్చి 8: రెండు సంస్థల మధ్య కాంట్రాక్టు రెన్యూవల్, డిపాజిట్ల వివాదం జఠిలం కావడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలోని పట్టణాల్లో మీ-సేవ కేంద్రాలు మూతబడ్డాయి. ఫలితంగా పౌరసేవల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగా మీ-సేవ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేశారు.

03/09/2016 - 05:08

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2015 మార్చి నాటికి 5.43 శాతంగా ఉంటే, డిసెంబర్ నాటికి 7.30 శాతానికి చేరాయన్నారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా జైట్లి తెలిపారు.

03/09/2016 - 05:06

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్‌లో ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తాయని సామ్‌సంగ్ మంగళవారం తెలిపింది. రూ. 48,900 నుంచి రూ. 56,900 వరకు వీటి ధరలుంటాయని సామ్‌సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ మను శర్మ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఎస్7.. 5.1 అంగుళాల డిస్‌ప్లే, 3,000 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీతో వస్తుండగా, ఎస్7 ఎడ్జ్..

03/09/2016 - 05:04

విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ట్రస్టు సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయతే దీనికి అదనంగా మరో 5 మెగావాట్ల ప్లాంట్‌కు విశాఖపట్నం పోర్టు ట్రస్టు (విపిటి) ప్రతిపాదించింది. దీర్ఘకాలిక పచ్చదనం పెంపు ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రతిపాదించారు.

03/09/2016 - 05:02

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత వారం నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి లాభాలను సూచీలు అందుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 12.75 పాయింట్లు పెరిగి 24,659.23 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 0.05 పాయింట్లు తగ్గి 7,485.30 వద్ద నిలిచింది. శుక్రవారం నిఫ్టీ 7,485.35 వద్ద స్థిరపడింది.

03/09/2016 - 05:00

న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రకు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవలియెర్ డి లా లీజియన్ డి’హానర్ (నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్) దక్కింది. భారత్‌కు ఫ్రాన్స్ అంబాసిడర్ అయిన ఫ్రాంకోయిస్ రిచెర్ ఈ నెల 5న ఆనంద్ మహీంద్రకు ఈ అవార్డును అందించినట్లు ఓ ప్రకటనలో మహీంద్ర అండ్ మహీంద్ర మంగళవారం తెలిపింది.

Pages