S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 07:02

హైదరాబాద్: పండ్లను కృత్రిమ రసాయనాలతో మగ్గించకుండా అరికట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. తాము సూచించిన సలహాలు, సూచనలను పాటిస్తామని రెండు ప్రభుత్వాలు హామీ ఇస్తే బాగుంటుందని హైకోర్టు పేర్కొంది. సుమోటోగా చేపట్టిన ఈ కేసుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

03/09/2016 - 06:57

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధను ఆర్ధికంగా పటిష్ఠం చేయాలని వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కండక్టర్ల వ్యవస్ధను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లను మంజూరు చేసి ఆర్టీసి నిలదొక్కుకునేందుకు చర్యలు తీసుకుందన్నారు. ఏపిఎస్ ఆర్టీసి కూడా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

03/09/2016 - 06:54

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతులని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ మంత్రి రావెలపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు.

03/09/2016 - 06:53

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

03/09/2016 - 06:53

హైదరాబాద్: విద్యుత్ ఆదాకు సంబంధించి ఎల్‌ఇడి బల్బులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ల ప్రక్రియ ద్వారా సేకరిస్తున్నారని, ఇందు లో పారదర్శకత లేదని, రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వ సంస్ధను అడ్టుపెట్టుకుని కుంభకోణానికి పాల్పడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

03/09/2016 - 06:51

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ల పోస్టులను మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

03/09/2016 - 06:50

హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో విశాఖపట్నంలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంపై బిజెపి శాసనసభ్యుడు పి విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మృణాళిని బదులిస్తూ ఆరు నెలల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, దరఖాస్తు దారులకు సొమ్ము చెల్లిస్తున్నామని తెలిపారు.

03/09/2016 - 06:49

హైదరాబాద్: దేశంలోనే అన్ని రాష్ట్రాలను మించి మహిళలకు పెద్దపీట వేసి గౌరవించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహిళలకు అన్ని రంగాలలోను 33 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించామని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

03/09/2016 - 07:09

క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

03/09/2016 - 06:37

న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్, యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై ‘ఆజ్ తక్ సలాం క్రికెట్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఒకరు అతనిని జావేద్ మియందాద్, టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోతో పోలిస్తే మరొకరు టీమిండియాలో మిగతా ఆటగాళ్లు ఎవరికీ లేని ప్రత్యేక, గౌరవం, ప్రధాన్యం కోహ్లీకి మాత్రమే ఉన్నాయని అన్నాడు.

Pages