S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 06:36

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ తనకు టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోను గుర్తుతెస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. మెకెన్రో తరచు ప్రత్యర్థి ఆటగాళ్లతో, అంపైర్లతో ఘర్షణకు దిగేవాడని అన్నాడు. ఈ విధంగా సవాళ్లు విసురుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్లడం వల్ల ఆట కొత్తపుంతలు తొక్కుతుందని అన్నాడు.

03/09/2016 - 06:35

నాగపూర్: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’లో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హాంకాంగ్‌ను ఢీకొన్న ఈ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు సాధించింది.

03/09/2016 - 06:33

ముంబయి: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య దేశం భారత్ గెలుస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జోస్యం చెప్పాడు. కానీ, పోటీలో ఉన్న అన్ని జట్లూ విజయాలు సాధించాలన్న పట్టుదతోనే బరిలోకి దిగుతున్నాయని, కాబట్టి పోరు తీవ్రంగా ఉంటుందని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డాడు. ఫేవరిట్ అంటే తన ఉద్దేశంతో బలమైన జట్టని చెప్పాడు.

03/09/2016 - 06:32

కొలంబో: శ్రీలంక సెలక్టర్లపై వేటు పడింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో లంక జట్టు దారుణంగా విఫలమైన కారణంగా కపిల విజెగుణవర్దన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఆగ్రహంతో ఉంది. అందుకే కమిటీని రద్దు చేసి, మాజీ బ్యాట్స్‌మన్ అరవింద డిసిల్వ నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

03/09/2016 - 06:24

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు నెత్తిన కరెంటు చార్జీల పిడుగుపడనుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు రూ.1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సదరన్ డిస్కాం, నార్తరన్ డిస్కాంలు మంగళవారం ఇక్కడ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి.

03/09/2016 - 06:23

నిజామాబాద్: పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీకి మచ్చ తెచ్చేలా ఎవరూ వ్యవహరించరాదని ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశాలలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంటే, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఓ వలస నేత ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

03/09/2016 - 06:23

దేవరకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్లగా పుట్టిన పాపానికి ఓ కన్నతల్లి 24 గంటల పాటు శిశువుకు పాలివ్వకుండా హతమార్చాలని చూసింది.

03/09/2016 - 06:21

హైదరాబాద్: ప్రభుత్వ రేషన్ సరుకులను కొనుగోలు చేస్తూ అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పేదలకు అందించే ప్రభుత్వ బియ్యాన్ని రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్ల వద్ద సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న అక్రమ వ్యాపారుల గోదాములపై మంగళవారం సివిల్ సప్లయి అధికారులతో కలసి దాడులు నిర్వహించారు.

03/09/2016 - 06:20

హైదరాబాద్: సమాజంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హోదా, సమాన వేతనం కోసం మహిళలు ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

03/09/2016 - 06:19

హైదరాబాద్: ‘ఓస్..ఇంతేనా! ఈ ఒప్పందం 2012లోనే చేశాం..’ అని శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. మహా ఒప్పందం కాదు మహా దగా..అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు.

Pages