S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 07:31

ఘట్‌కేసర్: అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని ఆదరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చౌదరిగూడ మాజి సర్పంచ్ బైరు రాములుగౌడ్ అన్నారు.

03/09/2016 - 07:30

హైదరాబాద్: ఓ టివి యాంకర్, ఆమె భర్తపై సిరియా దేశస్థుడు దాడి చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్ చౌరస్తా సిగ్నల్ వద్ద మంగళవారం జరిగింది. చిక్కడపల్లి ఇనె్స్పక్టర్ సుదర్శన్ కథనం ప్రకారం.. ఓ టివి ఛానల్‌లో పనిచేస్తున్న శివజ్యోతి, ఆమె భర్త ముత్యం మంగళవారం ఉదయం గం. 9.30లకు బైక్‌పై ఆర్టీసి క్రాస్ రోడ్డు నుంచి ఇందిరాపార్కు మీదుగా తమ ఆఫీసుకు వెళ్తున్నారు.

03/09/2016 - 07:29

హైదరాబాద్: వారణాసి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్ నగరాన్ని సందర్శించింది. వారణాని నగర నిగమ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిప్రతాపసాహి నేతృత్వంలో ఎనిమిది అధికారులతో కూడిన బృందం అధ్యయనం నిమిత్తం నగరానికొచ్చింది. ఇందులో భాగంగా వారు మంగళవారం కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి కుందన్‌బాగ్ పార్కులో అధికారికంగా కల్సుకున్నారు.

03/09/2016 - 07:27

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి నీటిని అందించేందుకు తొమ్మిదేళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఈ నెల 10 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది.

03/09/2016 - 07:26

హైదరాబాద్: నగర పోలీసులకు ఈ నెల 10 నుంచి ఉరుకులు, పరుగులు తప్పేట్టు లేవు. ఇప్పటికే నగరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతుండగా, ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాల బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ వసతి వంటి ముఖ్య అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.

03/09/2016 - 07:06

హైదరాబాద్: టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 18 కంపెనీలకు మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. 2167 కోట్ల 47లక్షల రూపాయల పెట్టుబడులతో 18 కంపెనీలను ఏర్పాటుచేయనున్నారు. వీటి ద్వారా 13,817 మందికి ఉపాధి లభిస్తుంది.

03/09/2016 - 07:05

హైదరాబాద్: మహిళల భద్రత, బాలికల సంరక్షణ కోసం ‘్భరోసా’ వెబ్‌సైట్‌ను నగర పోలీస్ కమిషనర్ కె.మహేందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను మహిళల భద్రత కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు, బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో ‘్భరోసా’ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

03/09/2016 - 07:04

హైదరాబాద్: మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బయటపెట్టాలని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

03/09/2016 - 07:04

హైదరాబాద్: ఓ మహిళను వేధించిన కేసులో ఏపి మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు రావెల సుశీల్‌కు మంగళవారం నాంపల్లి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడికి ఆదేశించింది. సుశీల్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పోలీసులు కేసు విచారణ పూర్తి చేశారని, రాజకీయ ఒత్తిడితో సుశీల్‌ను ఈ కేసులో ఇరికించారని న్యాయవాది వాదించారు.

03/09/2016 - 07:03

హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతికి సంబంధించిన నివేదికను జాతీయ మానవ హక్కుల సంఘానికి పంపే విషయమై తుది నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తాము ఎటువంటి సూచనలు చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిల్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

Pages