S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/18/2015 - 11:40

మహాభారత సంగ్రామంలో జగత్ప్రసిద్ధమైన కర్ణుడి మరణాన్ని జీర్ణించుకోలేక ధర్మరాజు వేదన చెందాడు. అశాంతితో తల్లిడిల్లినాడు. తల్లి కుంతీదేవి, సోదరులు ఎంత ఊరడించినా ధర్మజుని మనస్సు శాంతించలేదు. అర్జునునితో ధనంజయా! పూజ్యుడు, జ్యేష్ఠభ్రాతయైన కర్ణునీ, సకల బాంధవులనూ యుద్ధంలో చంపి మహా పాపంచేశాను.

03/18/2015 - 11:38

రోజూ షూటింగ్‌ల్లో పాల్గొంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ తప్పు ఎప్పుడు చేశామో గుర్తుండకపోవచ్చు. అందుకే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవంటోంది అందాలరాశి శృతిహాసన్. నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను చేసిన తప్పేంటో ఇతరులు చెప్పకముందే గుర్తించేసి సర్దుకుంటాను.

03/18/2015 - 11:35

‘వెయ్యి అబద్ధాలాడైనా పెళ్లి చేయాలన్న’ది ఒకప్పటి మాట. అయితే, మగపెళ్లివారు ఒక్క అబద్ధం చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వధువు తాళి కట్టించుకునేందుకు ‘ససేమిరా’ అనడంతో వివాహవేడుక రద్దయ్యింది. వరుడి విద్యార్హతల గురించి తనకు అబద్ధం చెప్పారని తెలియడంతో పెళ్లికుమార్తె ఈ నిర్ణయం తీసుకుంది.

03/18/2015 - 11:34

కరివేపాకు ప్రతి కూరలోనూ అవసరమే. శరీరంలో రక్తపుష్టికి దోహదపడుతూ ఎనీమియా, మలబద్ధకం,
అజీర్ణం వంటి అనారోగ్యాలను తగ్గించి కరివేపాకు బలం చేకూరుస్తుంది. మొదటి ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎలర్జీలు, జీర్ణకోశ వ్యాధులు,
విరేచనాలు, గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గుముఖం పడతాయ. పోపులకు, పులిహోరలో,
పులుసుల్లో వాడే కరివేపాకు మనకు నిజంగా ఆరోగ్య ప్రదాతే.

పచ్చడి

03/18/2015 - 11:32

లింగ వివక్ష, భ్రూణహత్యలను నివారించేందుకు దంపతులకు ఉచితంగా ‘గిఫ్ట్ ప్యాక్’లను అందజేయాలని రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినందున సామాజిక చైతన్యం కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. ‘ఆడశిశువుకుటుంబానికి భారం కాద’న్న విషయమై దంపతుల్లో అవగాహన పెంచేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు.

03/18/2015 - 11:30

ముకుందం వయసు అరవై ఏళ్లు. పనిమీద పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా ఎండెక్కింది. బస్టాండ్‌కు వచ్చేసరికి కళ్ళు తిరిగి బెంచీపై వాలిపోయాడు. పక్కనున్న ప్రయాణికులు వెంటనే ముఖాన చల్లటి నీళ్ళు చల్లి తగిన సపర్యలు చేయడంతో ముకుందం బతికి బయటపడ్డాడు.
***

03/18/2015 - 11:25

కథల పోటీలో ఎంపికైన రచన
...............

03/18/2015 - 11:23

కె.వి.ఎం.సురేశ్‌బాబు, ఒంగోలు
ప్ర: మనశ్శాంతితో స్థిరపడే యోగం ఉన్నదా?
సమా: ఒకే లక్ష్యంతో, ఒకే దీక్షతో భగవద్గీతను గురువుగా భావిస్తూ ప్రయత్నించండి. ఫలితం లభిస్తుంది. శాంతి బయట లేదు, మనలోనే ఉంది. ‘మనసే మనిషికి తీయని వరమూ, మనిషి బ్రతుకు నరకవౌను మనసు తనది కానిచో’ అంటూ సినీ గీతాలైనా గొప్ప నీతిని బోధించాయి. ఆలోచించండి.
డి.రేవతి, గజపతినగరం
ప్ర: నా సంకల్పం నెరవేరుతుందా?

03/14/2015 - 12:09

కొలంబో, మార్చి 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, శ్రీలంక శుక్రవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌కు వ్యూహాత్మక పొరుగుదేశంగా ఉన్న శ్రీలంకతో సంబంధాలను పెంపొందించుకునేందుకు చేపట్టనున్న పలు చర్యలను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.

03/14/2015 - 12:05

సిడ్నీ, మార్చి 13: ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌ని వర్షం కూడా వెంటాడింది. డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 101 పరుగులు సాధించాల్సి ఉండగా, మరో 41 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. అయితే, భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఈ జట్టు ఇంటిదారి పట్టక తప్పలేదు.

Pages