S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/18/2017 - 00:35

అమరావతి, నవంబర్ 17: అమరావతి నిర్మాణాలపై సుదీర్ఘకాలం నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) లో ఉన్న కేసుపై ఎట్టకేలకు తుది తీర్పు వచ్చింది. అయితే, అందులో ట్రైబ్యునల్ విధించిన షరతులు, కమిటీల పర్యవేక్షణ, నివేదికల వ్యవహారం ప్రభుత్వానికి సానుకూలమా? వ్యతిరేకమా? అన్న చర్చకు తెరలేచింది. దానికంటే ముందు..

11/17/2017 - 04:33

అమరావతి, నవంబర్ 16: వైసీపీ అధినేత జగన్‌ను సొంత నియోజకవర్గంలో దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దశాబ్దాల నుంచి తిరుగులేకుండా గెలుస్తూ వస్తోన్న వైఎస్ కుటుంబ విజయపరంపరకు ఇటీవల జరిగిన కడప జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించటం ద్వారా నైతికస్థైర్యం సాధించిన టీడీపీ ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ సీటుపై కనే్నసింది.

11/17/2017 - 04:32

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 16: రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించదలపెట్టిన ప్రభుత్వ నగర హౌసింగ్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి గాను అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం సీఆర్‌డీఎ కార్యాలయంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకొన్న నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన శ్రీ్ధర్ ప్రాజెక్టు నిర్వహణపై పలు సూచనలు చేశారు.

11/17/2017 - 04:16

విశాఖపట్నం, నవంబర్ 16: వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కాదని, పదవి కోసమేనని రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. విశాఖలో జరుగుతున్న ఎపి అగ్రిటెట్ సమ్మిట్-2017లో ఎగ్జిబిషన్‌ను గురువారం సందర్శించిన ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా పాదయాత్రలు చేసే విపక్ష నేతను తన రాజకీయ చరిత్రలో చూడలేదన్నారు.

11/17/2017 - 04:16

కడియం, నవంబర్ 16: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ శివారాధనలో విశిష్టతను సంతరించుకున్న బిల్వ మొక్కల్లో మహాబిల్వం మొక్క కడియం నర్సరీలో ఆవిష్కృతమైంది. సృష్టికి ప్రతి సృష్టి చేయగల నర్సరీ రైతులు త్రిదళంతో ఉండే మారేడు మొక్కకు సంకరంచేసి, హైబ్రిడ్ బిల్వను తయారుచేశారు. ఈ మొక్క విశేషమేమిటంటే సాధారణ మొక్కకు మూడు రెమ్మలతో ఆకు ఉంటుంది.

11/17/2017 - 04:14

రామచంద్రపురం, నవంబర్ 16: కార్పొరేట్ ఆసుపత్రుల సేవలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తోంది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి. రొమ్ము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు గురువారం విజయవంతంగా శస్తచ్రికిత్స నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు పలువురి ప్రశంసలు అందుకున్నారు.

11/17/2017 - 04:05

ఆళ్లగడ్డ, నవంబర్ 16: మీ సమస్యలు తీర్చేందుకు నేనున్నానని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో గురువారం ప్రజా సంకల్పయాత్ర 10వ రోజు ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో కొనసాగింది. పాదయాత్రలో పలు సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పలువురు రైతులు జగన్‌ను కలిసి తెగుళ్లు సోకిన పంటలను చూపించి తమను ఆదుకోవాలని కోరారు.

11/17/2017 - 04:03

శ్రీకాకుళం, నవంబర్ 16: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు కుదేలయ్యారు. జిల్లాలోని 38 మండలాల్లో 6.50 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వరి వేశారు. నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ, తోటపల్లి, మడ్డువలస ప్రాంతాల్లో వరి పంట అధిక దిగుబడి వచ్చిందన్న ఆనందాన్ని ఉద్దానంలోనే 1.28 లక్షల ఎకరాల్లో వరి నీటమునిగి, నేలకొరిగి నాశనమైపోయింది.

11/17/2017 - 04:01

నెల్లూరు, నవంబర్ 16: సామాజిక సేవలో భాగంగా కృష్ణపట్నం నౌకాశ్రయం, సివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని రాష్టప్రతి రామనాథ్ కోవింద్ ప్రశంసించారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం, తూర్పుకనుపూరు గ్రామంలో నిర్వహిస్తున్న నవనీత పబ్లిక్ స్కూలు విద్యార్థులు ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో బుధవారం కలిశారు.

11/17/2017 - 00:34

ఆచంట, నవంబర్ 16: వెనుకబడిన వర్గాలలో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై తగు సూచనలు, సలహాలు అందించాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు.

Pages