S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/03/2017 - 02:10

అనంతపురం, నవంబర్ 2: స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అనంతపురం జిల్లాలో నత్తనడకను తలపిస్తోంది. వచ్చే జనవరి 26 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా అనంతపురంను నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

11/03/2017 - 02:08

అనకాపల్లి, నవంబర్ 2: సాగు ఖర్చులు తగ్గించడం, తెగుళ్లను నివారించడం, అధిక దిగుబడులు సాధించడం తదితర ప్రామాణికాలపై శాస్తవ్రేత్తలు అనునిత్యం సాధించే ఫలితాలను ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సంబంధిత పరిశోధనా కేంద్రం ఎడిఆర్ పరిశోధనా సంచాలకులకు ఇట్టే తెలుసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

11/03/2017 - 02:06

విశాఖపట్నం, నవంబర్ 2: శ్రీలంకను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా అల్పపీడనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ఒకటి, రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

11/03/2017 - 02:05

తిరుపతి/చిన్నగొట్టికల్లు/మర్రిపాడు/సీతారాంపురం, నవంబర్ 2:, : చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గురువారం ఎర్రచందనం తరలిస్తున్న కూలీల పోలీసులపై తెగబడ్డారు. కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై లారీతో ఢీకొనే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అలాగే తిరుపతి సమీపంలోని కరకంబాడివద్ద మరో ఘటనలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

11/03/2017 - 02:03

శ్రీకాళహస్తి, నవంబర్ 2: రాష్ట్రంలో దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని, ఇది మంచి పరిణామం కాదని విశాఖపట్టణం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే దర్శనం టిక్కెట్లు, ప్రసాదాలు, అభిషేకాల టిక్కెట్లను ఇష్టమొచ్చినట్లుగా పెంచుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు.

11/03/2017 - 02:00

రాజమహేంద్రవరం, నవంబర్ 2: రాజమహేంద్రవరంలోని ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్సులో కనిపించిన చిరుత కోసం అటవీ శాఖ గాలింపు కొనసాగుతోంది. 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్సు వెనుకభాగంలోని దట్టమైన రిజర్వు ఫారెస్టులోంచి ఈ చిరుత బేస్ కాంప్లెక్సులోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు. చిరుత భయంతో ఇదే ప్రాంగణంలోవున్న కేంద్రీయ విద్యాలయానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

11/03/2017 - 00:26

విజయవాడ, నవంబర్ 2: టిడిపి సీనియర్ నేత కింజరపు ఎర్రన్నాయుడు ఐదో వర్ధంతిని గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ నేతలు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

11/03/2017 - 00:25

విజయవాడ, నవంబర్ 2: రాష్ట్రంలోని 34 మండల స్థాయి స్టాక్ పాయింట్ల (ఎంఎల్‌ఎస్) వద్ద రూ.6.50 కోట్ల వ్యయంతో 50 టన్నుల సామర్థ్యం కలిగిన వేబ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ ఎం లింగారెడ్డి తెలిపారు.

11/03/2017 - 00:25

విజయవాడ, నవంబర్ 2: కిడ్నీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సాయం కోసం మరింత మంది ముందుకొస్తున్నారు. దీంతో అదనంగా చేరినవారితో సెర్ప్ అందిస్తున్న కిడ్నీ బాధితుల పింఛన్లు అక్టోబర్‌లో మరో 215 పెరిగాయి. వీరికి ఇతర పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఈ సహాయం కొనసాగుతోంది. ఈ విధానం ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చింది. దాంతో నిరుపేద కిడ్నీ బాధితులకు ప్రతినెలా రూ.

11/03/2017 - 00:23

అమరావతి, నవంబర్ 2: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్ని కుటుంబాలకు చేరుతున్నాయన్న దానిపై లెక్క తేల్చుకునే పనికి టిడిపి శ్రీకారం చుట్టింది. అలాగే టిడిపికి పడే ఓట్లు ఎన్ని? విపక్షానికి ఎన్ని వెళ్తాయో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఓ కార్యక్రమాన్ని చేపడుతోంది. తమకు అనుకూలంగా ఉంటాయని గుర్తించి అలాంటి ఇళ్లపై పార్టీ జెండాలు ఎగరేయాలని టిడిపి నిర్ణయించింది.

Pages