S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/11/2017 - 03:43

విజయవాడ, సెప్టెంబర్ 10: కామనె్వల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రత్యేక రాయబారి కనికా చౌదరి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. పెన్సిల్వేనియా, ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర సౌహార్ద్ర సంబంధాలపై వీరు చర్చించారు. తన బృందాన్ని ఆమె ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర సంబంధాల గురించి ఎపి ఆర్థికాభివృద్ధి మండలి సిఇవో కృష్ణకిషోర్ వారికి వివరించారు.

09/11/2017 - 03:38

విజయనగరం, సెప్టెంబర్ 10: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, కూనేరు రైల్వే స్టేషన్‌లో హిరాఖండ్ ప్రమాద ఘటన జరిగి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటి వరకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) నివేదికను బహిర్గతం చేయలేదు. ఈ సంఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికిపైగా గాయాల పాలైన విషయం విదితమే. కాగా, ఈ రైలు ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా?

09/11/2017 - 02:04

విజయవాడ, సెప్టెంబర్ 10: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సామాజిక హక్కు ల వేదిక రాష్ట్ర కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

09/11/2017 - 02:02

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: ఏపీలో సరికొత్త ఆలోచనలతో ప్రారంభించే స్టార్టప్ కంపెనీలకు నేషనల్ రిసెర్చ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఆర్‌డిసి) చేయూతనివ్వనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ హెచ్.పురుషోత్తం వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో సుమారు వెయ్యి పరిశోధనా సంస్థలు, 800 యూనివర్శిటీల్లో వివిధ అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.

09/10/2017 - 03:47

ఒంగోలు, సెప్టెంబర్ 9: ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు మండలం ఫతేపురం గ్రామాన్ని వివాదరహితంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ప్రధానన్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని తెలిపారు. శనివారం ఉదయం ఒంగోలు నగరంలోని జిల్లా న్యాయస్ధానం ఆవరణలోని న్యాయసేవసదన్‌లో జిల్లా న్యాయమూర్తిప్రియదర్శిని జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

09/10/2017 - 03:45

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: తన జన్మదిన వేడుకల సందర్భంగా అలనాటి ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపి జమునను నవరస కళావాణి బిరుదుతో సత్కరిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమున సినీ జీవితంలో డైమండ్ జూబ్లీ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఆమెను ఈ బిరుదుతో సత్కరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

09/10/2017 - 03:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ వేదికగా నిలిచిందని అంతర్జాతీయ ఇన్నోవేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు అలిరేజా రాస్టేగర్ అన్నారు. ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ -2017ను విశాఖలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా జరిగే ప్రదర్శనల ద్వారా ఔత్సాహికుల్లో ప్రేరణ సరికొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతుందన్నారు.

09/10/2017 - 03:41

విజయవాడ, సెప్టెంబర్ 9: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31నాటి కల్లా ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని నిర్మాణ సంస్థకు గడువు విధించారు.

09/10/2017 - 03:38

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో మిగులు పనులను కొత్త కాంట్రాక్టులకు ప్రభుత్వం అప్పగించింది. పనులను మరింత వేగంగా పూర్తి చేసి 2018 నాటికి గ్రావిటీ, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇపుడున్న కాంట్రాక్టు సంస్థలతో పాటు మరిన్ని సంస్థలను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ మేరకు పనులు తాజాగా అప్పగించింది.

09/10/2017 - 03:28

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి జరగనున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో గ్రామగ్రామానా, వార్డు వార్డునా ప్రతి ఇంటిపై తెలుగుదేశం జెండా ఎగరాలి.. ప్రతి కుటుంబంలో మన పార్టీ సభ్యత్వం ఉండాలి.. ప్రతి ఇంటి తలుపుపై పార్టీ స్టిక్కర్ అంటించాలి.. ఇంటింటికి వెళ్లాలి.. ప్రతి ఒక్కరిని పరామర్శించాలి.. వాళ్ల యోగ క్షేమాలు తెలుసుకోవాలి.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో విచారించాలి..

Pages