S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/08/2017 - 03:08

నంద్యాల, జూలై 7: కర్నూలు జిల్లా నంద్యాలకు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీపై వైకాపా పునరాలోచించాలని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి అన్నారు. గతంనుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించే విషయంలో జగన్ మరోసారి ఆలోచించాలన్నారు.

07/08/2017 - 03:08

అమరావతి, జూలై 7: అక్రమాస్తుల కేసులో సిబిఐతో 11 చార్జిషీట్లు, ఈడితో 6 చార్జిషీట్లు వేయించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అవినీతిపై రేపు జరగబోయే వైఎస్సార్ సిపి ప్లీనరీలో చర్చించగలరా అని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య సవాల్ విసిరారు.

07/08/2017 - 03:07

అనంతపురం, జూలై 7: అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్ని సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. అనంతపురంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూలీలు, కార్మికుల సంక్షేమానికి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.

07/08/2017 - 03:06

విశాఖపట్నం, జూలై 7: విశాఖ నుంచి ఒడిశాకు భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డిఆర్‌ఐ) విశాఖ శాఖ అధికారులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద ఒక టిప్పర్‌లో తరలిస్తున్న 2,629 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

07/08/2017 - 01:45

విజయవాడ, జూలై 7: న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాల సంక్షేమ నిధి స్టాంప్ ధరను రూ.50 నుంచి రూ.100కు పెంచటంతోపాటు న్యాయవాదులు, న్యాయవాద గుమాస్తాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని సిఎం చంద్రబాబును శుక్రవారం వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ల రాష్ట్ర ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు.

07/08/2017 - 01:44

విజయవాడ, జూలై 7: గోవా కూడా భారతదేశ ఐటీ ముఖ చిత్రంలో ప్రధాన భూమిక పోషించేందుకు ప్రయత్నిస్తున్నామని, దానికి ఆంధ్రప్రదేశ్ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందించాలని గోవా ఐటీ శాఖ మంత్రి రోహన్ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గోవాను సోదర రాష్ట్రంగా భావిస్తామని, దాని అభివృద్ధికి తప్పక సహకరిస్తామని మాటిచ్చారు.

07/08/2017 - 01:43

సింహాచలం, జూలై 7: శ్రీ వరాహ నారసింహ అవతార కలయికతో కొలువైన సింహాచలేశుని సింహగిరి ప్రదక్షిణ వేడుకకు సర్వం సిద్ధమైంది. శనివారం జరిగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులు సుమారు 32 కిలోమీటర్ల మేర వరాహనారసింహుడు కొలువైవున్న కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రతి ఏటా ఆషాడ చతుర్థశి నాడు ఈ పవిత్రమైన సింహగిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ.

07/08/2017 - 01:42

పాములపాడు, జూలై 7: అమరావతికి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ వాహనాలను కర్నూలు జిల్లా పాములపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుంటూరు మార్గంలో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఫలితంగా రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు.

07/08/2017 - 01:41

విజయవాడ, జూలై 7: వెలగపూడి సచివాలయం వద్ద రెండు కార్లలో మద్యం బాటిళ్ల వ్యవహారం శుక్రవారం కలకలం రేపింది. సచివాలయంలోకి వేళ్లేందుకు వచ్చిన రెండు కార్లను సచివాలయం గేట్-2 వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఒక కారులో డిక్కీలో రెండు, మరో కారులో డిక్కీలో ఒక మద్యం బాటిలును గుర్తించారు. కారు డిక్కీల్లో మద్యం బాటిళ్లు లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు.

07/08/2017 - 01:39

భీమవరం, జూలై 7: రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకదృష్టి సారించింది. దక్షిణ భారతదేశంలో కాషాయ పతాకాన్ని రెపరెపలాడించడానికి తహతహలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని బూత్ సమ్మేళన్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Pages