S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/07/2017 - 03:19

నెల్లూరు, జూలై 6: రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు నెల రోజుల్లో చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘం (విజిలెన్స్) సమావేశం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

07/07/2017 - 03:19

శాంతీపురం, జూలై 6: కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొదటి శాసనసభ్యుడు నందిగం రంగస్వామినాయుడు(84) గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం శాంతీపురంలోని ఆయన నివాస గృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. 1983లో కుప్పం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.

07/07/2017 - 03:18

న్యూఢిల్లీ,జూలై 6: వంశధార నదిపై శ్రీకాకుళం జిల్లాలోని కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణం వల్లన ఒడిశా రాష్ట్రానికి ఎటువంటి నష్టం లేదని వంశధార ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు వినిపించింది. ఆంధ్రా-ఒడిషా రాష్ట్రాల నదీ జలాల వివాదం వంశధార ట్రిబ్యునల్ ముందు ఆంధ్ర, ఒడిశాలు తమ వాదనలను కొనసాగిస్తున్నాయి.

07/07/2017 - 03:18

న్యూఢిల్లీ, జూలై 6: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభ నుంచి సస్పెన్షన్ వ్యవహారంలో ఆమె ఇచ్చిన క్షమాపణ లేఖను అసెంబ్లీ స్పీకర్ పరిశీలనలోకి తీసుకుని పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. గతంలో రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అమితావ్‌రాయ్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

07/07/2017 - 03:17

విశాఖపట్నం, జూలై 6: రాష్ట్రంలో అమలు జరుగుతున్న మద్యం విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మహిళలను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు వైకాపా పావులు కదుపుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగే ప్లీనరీ సమావేశంలో కీలక ప్రకటన చేసి ప్రభుత్వానికి చెక్ చెప్పడానికి ప్రయత్నిస్తోంది.

07/07/2017 - 03:16

ఏలూరు, జూలై 6: పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని ఏడులక్షల ఎకరాలకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2018 జూన్ నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 33 మండలాల పరిధిలోని 210 గ్రామాలకు తాగు, సాగునీరు అందించడానికి నాలుగువేల కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్నారు.

07/07/2017 - 03:14

విశాఖపట్నం, జూలై 6: స్వచ్ఛ్భారత్ గురించి మాట్లాడ్డమే కాకుండా, దాన్ని ఆచరణలో చూపాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన స్వచ్ఛ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జాతిపిత గాంధీ స్వేచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్‌ను కోరుకున్నరని అన్నారు. స్వేచ్ఛ భారతాన్ని సాధించి 70 ఏళ్ళవుతున్నా స్వచ్ఛ భారత్‌ను మనం నెలకొల్పలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

07/07/2017 - 02:46

గుంటూరు, జూలై 6: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చలో అమరావతి పేరిట నిర్వహించ తలపెట్టిన కురుక్షేత్ర మహాసభకు అనుమతి లభించలేదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈనెల 7 వ తేదీన మహాసభ నిర్వహించాలని గతంలోనే నిర్ణయించి, గత నెలరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

07/07/2017 - 02:46

విజయవాడ, జూలై 6: గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా దేశాలకు వెళ్లాక అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా దుబాయ్ ప్రభుత్వంతో త్వరలో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారి సంక్షేమం కోసం వివిధ పథకాలతో ఒక కొత్త విధానానికి సర్కారు రూపుకల్పన చేస్తోంది.

07/07/2017 - 02:45

విజయవాడ, జూలై 6: పురపాలక మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో మలేసియా, చైనాల్లో గత మూడు రోజులుగా పర్యటిస్తున్న బృందం మూడవ రోజైన గురువారం చైనాలో బిజీగా గడిపింది. చైనాలోని చాంగ్నా, ఝుఝా నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను క్షేత్ర స్థాయిలో తిరిగి పరిశీలించారు. ముఖ్యంగా అక్కడి లోస్పీడ్ మాగ్లేవ్ రైలు వ్యవస్థను పరిశీలించిన బృందం, ఆ రైలులో ప్రయాణించింది.

Pages