S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/07/2017 - 02:44

విజయవాడ, జూలై 6: పాఠశాలలకు సంబంధించి అమల్లో ఉన్న వివిధ నిబంధనలను సవరిస్తూ ముసాయిదాను రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తయారు చేసింది. కొత్త పాఠశాలల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్, ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి నిబంధనల్లో మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను తీసుకోనుంది.

07/07/2017 - 02:44

అమరావతి, జూలై 6: అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో వనం-మనం వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) దినేష్‌కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీలను కోరారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/07/2017 - 02:43

అమరావతి, జూలై 6: పర్యాటక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తుందని, వాటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పర్యాటక, వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసేలా ఏపి ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందిస్తుందని, జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలకు ఇది శుభపరిణామమన్నారు.

07/07/2017 - 02:42

అమరావతి, జూలై 6: ‘ఇదే అప్పటి చంద్రబాబునయితే అక్కడికక్కడే సస్పెండ్ చేసేవాడిని. ఇప్పుడు అందరితో ఓపికగా పనిచేయించాలని అనుకుంటున్నా కాబట్టే వదిలేశా’
‘ సరైన కారణాలు లేకుండా ప్రజలను తిప్పించుకుంటూ వారి సమస్యలను పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టే అధికారులకు జరిమానా వేద్దాం. ఇలాంటి వ్యవస్థ లేకపోతే ఎంతచెప్పినా కొందరిలో మార్పు రావడం లేదు’

07/07/2017 - 02:40

విజయవాడ, జూలై 6: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అనంతపురంలో 3, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కటి, కృష్ణా, శ్రీకాకుళంలో రెండు చొప్పున మండల అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి.

07/07/2017 - 02:40

గుంటూరు, జూలై 6: బతికున్న మాదిగవైతే కురుక్షేత్ర మహాసభకు తరలి..రా! నినాదంతో ఎమ్మార్పీఎస్ నేతల పేరిట ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిసాయి.. అయితే వీటిలో మాజీమంత్రి, ప్రత్తిపాడు టిడిపి ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు ఫొటో కూడా ముద్రించటంతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది.. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

07/07/2017 - 02:39

విజయవాడ, జూలై 6: శాంతిభద్రతలకు విఘాతం కల్గించే శక్తులను అణచివేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి ముద్రగడ, మందకృష్ణ మాదిగలను విపక్ష నేత వైఎస్ జగన్ రెచ్చకొడుతున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందే యత

07/07/2017 - 02:39

విజయవాడ, జూలై 6: ఉపాధ్యాయ సంఘాలు, కొందరు డిఇవోల లేఖలపై స్పందిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గురువారం బదిలీలకు సంబంధించి సవరణలు, వివరణలిస్తూ ఆర్‌జెడి, డిఇవోలకు ఆదేశాలు పంపారు.

07/07/2017 - 02:03

విజయవాడ, జూలై 6: రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో, బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫ్రొపెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 198 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య శాఖలో ఆరు నెలలపాటు సమ్మెలను కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

07/07/2017 - 02:03

ప్రత్తిపాడు, జూలై 6: తమది కాపులకు రిజర్వేషన్ సిఫార్సు చేసేందుకు నియమించబడిన కమిషన్ కాదని, బిసిల స్థితిగతులు పరిశీలించడమే తమ కమిషన్ పని అని జస్టిస్ మంజునాథ్ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.

Pages