S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/05/2017 - 04:14

విజయవాడ (క్రైం), జూలై 4: రాష్ట్రంలో 17మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఎస్పీలు, డిఐజి, ఐజి క్యాడర్‌లో ఉన్న పలువురు ఐపిఎస్‌లను కొద్దిరోజుల తేడాతో రెండు విడతలుగా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిఎస్పీల వంతు వచ్చింది. చాలారోజులుగా డిఎస్పీల బదిలీలు భారీగా ఉంటాయని భావిస్తూ వచ్చిన పోలీసు వర్గాల్లో తాజాగా తొలిదశ జాబితా విడుదల పట్ల ఆసక్తి నెలకొంది.

07/05/2017 - 04:13

విశాఖపట్నం, జూలై 4: బహుళ ప్రయోజనాల సోలార్ వ్యవసాయ పంపుసెట్లకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వీటిని వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసుకునేందుకు రైతులు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారు. సోలార్ వ్యవసాయ పంపుసెట్లను మరింతంగా విస్తరించేందుకు ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడిసిఎల్) ప్రత్యేక దృష్టిసారించింది.

07/05/2017 - 04:13

విజయవాడ, జూలై 4: రాష్ట్రంలోని 29వేల మంది రేషన్ డీలర్లకు కార్పస్ ఫండ్ నుండి క్రియాశీలక సభ్యత్వం ద్వారా బీమా సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం విజయవాడలోని రాష్ట్ర అతిథిగృహంలో రేషన్ డీలర్లు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/05/2017 - 03:54

అమరావతి, జూలై 4: రాష్టప్రతి పదవికి ఈ నెల 17న జరగనున్న ఎన్నికలో అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అందరివాడు కానున్నారు. అధికార తెలుగుదేశం, ప్రతిపక్షమైన వైస్సార్‌సీపీకి చెందిన శాసనసభ్యులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే పోల్‌కానున్న విచిత్ర రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రెండు పార్టీలూ ఆయనకు మద్దతు ప్రకటించడమే ఇందుకు కారణం.

07/05/2017 - 03:53

అమరావతి, జూలై 4: ‘మనం చరిత్రలో ఎవరూ చేయనన్ని మంచి పనులు చేశాం. ఇంకా చేస్తున్నాం. కానీ చేసిన పనులు చెప్పడంలో వెనుకబడ్డాం. మనం వౌనంగా ఉంటే మనం ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఈ ప్రతిపక్షంతో జాగ్రత్తగా ఉండండి. మరో మూడునెలల్లో 24 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు ఇక కరవు సమస్య పెద్దగా ఉండదు.

07/05/2017 - 03:52

విజయవాడ (క్రైం), జూలై 4: ఏపిఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారనే ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ మంత్రి కె అచ్నెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆర్టీసీ సిబ్బంది ఆస్పత్రిని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, అవాస్తవ ప్రచారాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

07/05/2017 - 03:51

విజయవాడ, జూలై 4: రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోయినప్పటికీ పోలవరం ప్రాజెక్ట్‌ను 2020లోపు పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఏమాత్రం కన్పించడం లేదని రాజమంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు.

07/05/2017 - 03:51

విజయవాడ, జూలై 4: బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రవేశపెట్టిన కశ్యప పింఛన్ పథకాన్ని త్వరలో పునరుద్ధరించనున్నట్లు ఏపి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ప్రకటించారు. గొల్లపూడిలోని కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన 13 జిల్లాల కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

07/05/2017 - 03:50

విజయవాడ, జూలై 4: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు సమక్షంలో ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.

07/05/2017 - 03:50

హైదరాబాద్, జూలై 4: వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే తాను వైకాపాలో చేరుతున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో విజయవాడలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Pages