S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/20/2017 - 04:41

విజయవాడ, ఏప్రిల్ 19: వీధి బాలలకు విద్యా, ఆరోగ్య సాధికారత, గౌరవ ప్రదమైన జీవన విధానాలకు మెప్మా రూపకల్పన చేసిన రాగ్ పికర్స్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. చిత్తు కాగితాలు ఎరుకునే వీధి బాలల జీవన విధానం తదితర అంశాలపై ఈ పుస్తకాన్ని రూపొందించారు.

04/20/2017 - 04:21

నంద్యాల సీటు వెరీ హాటు బాబును కలిసిన అఖిల, శిల్పా బ్రదర్స్
24న అభ్యర్థిని ప్రకటిస్తామని అఖిల ఏకపక్ష ప్రకటన
పోటీ ఖాయమని తేల్చి చెప్పిన శిల్పా సీటు ఇవ్వకపోతే వైసీపీలోకి..

04/20/2017 - 04:18

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 23 నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాల క్యాలెండర్‌కు ఒక రోజు ముందే పాఠశాలలు మూతపడనున్నాయి. ఎండ ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది 1 నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు గత నెలలో ముగిసినప్పటికీ, ప్రత్యేక తరగతులను ఈ నెల రోజుల కాలంలో నిర్వహించారు. దీంతో పరీక్షలు ముగిసినప్పటికీ, దాదాపు మూడు వారాల పాటు పాఠశాలలు పనిచేశాయి.

04/19/2017 - 01:17

ఫలితాల ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు విభజనతో సేవల రంగంలో వెనుకబడ్డాం
ఏడు ఆదాయ ఆర్జనశాఖ అధికారులతో బాబు సమీక్ష నోట్ల రద్దువల్లే ఆదాయం రాలేదన్న అధికారులు

04/19/2017 - 01:13

విజయవాడ, ఏప్రిల్ 18:రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. అయితే కాంట్రాక్టు కార్మికుల జీతాలను 50 శాతం పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వేతనం పెంపు వల్ల 26,664 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

04/19/2017 - 01:09

నంద్యాల, ఏప్రిల్ 18: కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైకాపాలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక టికెట్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి స్పష్టమైన హామీ రానందున వైకాపాలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడంపై ఇప్పటికే తన అనుచరులకు మోహన్‌రెడ్డి చూచాయగా తెలిపినట్లు సమాచారం.

04/18/2017 - 10:09

హైదరాబాద్/విజయవాడ, ఏప్రిల్ 17: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. నెహ్రూకు భార్య, కుమారుడు అవినాష్, కుమార్తె క్రాంతి ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నెహ్రూను కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు.

04/18/2017 - 10:12

మారేడుమిల్లి, ఏప్రిల్ 17: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చావడికోట పంచాయతీ బందగ్రామం సిరిపెనలోవ కొండపై ఆదివారం సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. వీరిలో ఏడాది వయస్సున్న ఇద్దరు కవలలు కూడా ఉన్నారు. వీరిని రక్షించడానికి ప్రయత్నించిన వారి తాతయ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

04/18/2017 - 09:24

ఏలూరు, ఏప్రిల్ 17:‘మీ ధోరణి చూస్తుంటే ఇక్కడకు వచ్చి కప్పు కాఫీ తాగి, మిమ్మల్ని మెచ్చుకుని వెళ్లిపోవాలేమోనని అన్పిస్తోంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు చురకలు వేశారు. ప్రధాన పనులు మినహా మిగిలినచోట్ల ఆ వేగం కన్పించటం లేదంటూ కాంట్రాక్టు ఏజన్సీలకు కూడా అక్షింతలు వేశారు.

04/18/2017 - 09:20

అమరావతి, ఏప్రిల్ 17: జిల్లా కలెక్టర్ల బదిలీలపై గత కొద్ది వారాల నుంచి జరుగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎట్టకేలకు తెరదించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ, మొత్తం 20 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు.

Pages