S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/17/2017 - 03:42

అమరావతి, జనవరి 16: ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పుడు ఆర్కిటెక్ట్‌ల కంటే సినిమా దర్శకులకే ప్రాధాన్యం పెరిగిపోయింది.

01/17/2017 - 03:54

ఆలమూరు, జనవరి 16: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి కూరగాయల మార్కెట్‌కు సోమవారం సాయంత్రం ఆరు అడుగుల మూడు అంగుళాల పొడవుగల భారీ ము నగకాడ వచ్చింది. కడియం మండలం వేమగిరికి చెందిన దొంగ భాస్కరరావు అనే రైతు తన పొలంలోని మునగ చెట్టుకు కాసిన ఈ కాడను మార్కెట్‌కు తీసుకొచ్చారు.

01/17/2017 - 03:40

అరకులోయ, జనవరి 16: సెల్ఫీ సరదా ఒక విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. పర్యాటక ప్రాంతమైన అరకులోయకు విశాఖపట్నం నుంచి వచ్చిన బి.టెక్ విద్యార్థి బృందంలోని ఒక విద్యార్థి సెల్ఫీ దిగుతూ ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్నాడు. స్థానిక యండపల్లివలస రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని గీతంలో బి.టెక్ చదువుతున్న నలుగురు విద్యార్థులు సోమవారం అరకులోయ వచ్చారు.

01/17/2017 - 02:50

విజయవాడ, జనవరి 16: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో అమల్లోకి వచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం నవ్వులపాలవుతున్నట్లు స్పష్టవౌతోంది. ప్రస్తుతం ఏ క్షణాన ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పక్షంలోకి 3జంప్2 చేస్తారో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.

01/17/2017 - 02:46

తిరుపతి, జనవరి 16: కాపులను గత 64 సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నాం. ఇక ఏ మాత్రం భరించలేం. బలిజలకు రాజకీయంగా న్యాయం జరగడానికి ప్రాణాలైనా అర్పిస్తాం. నెలాఖరులోగా సిఎంను కలసి మాకు న్యాయం చేయాలని కోరుతామని టిటిడి పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ ఉద్వేగంగా అన్నారు. తిరుపతిలో తన స్వగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.

01/17/2017 - 02:45

విజయవాడ, జనవరి 16: జన్మభూమి కార్యక్రమం ఒక పండుగలా సాగిందని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం దీనిద్వారా లభించిందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

01/17/2017 - 02:44

విజయనగరం, జనవరి 16: 2015-16 సంవత్సరానికి సంబంధించి సోలార్ పంపుసెట్ల ఏర్పాటులో లక్ష్యాన్ని సాధించినందుకుగాను జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి లభించిందని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. న్యూ అండ్ రెన్యువబుల్ మంత్రిత్వశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందాయన్నారు. ఈ నెల 24న న్యూడిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో కోల్, పవర్, ఎన్‌ఆర్‌ఐ శాఖామాత్యుల చేతుల మీదుగా ఈ అవార్డును అందజేస్తారని కలెక్టర్ వివరించారు.

01/17/2017 - 02:44

హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందున తగు చర్య తీసుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎపి శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ ఎ. చక్రపాణికి ఫిర్యాదు చేశారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు చేసిన కాకానిపై ప్రివిల్లేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

01/17/2017 - 02:43

న్యూఢిల్లీ, జనవరి 16: త్వరలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పట్ట్భద్రుల నియోజకవర్గల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదిత్యను ప్రకటించింది. అలాగే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా రామచంద్రారెడ్డిని ప్రకటించారు.

01/17/2017 - 02:42

విజయవాడ, జనవరి 16: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరకుల నాణ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. జ్యూరిచ్ నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, కందికి గిట్టుబాటు ధరపై సోమవారం ఆయన అధికారులతో టెలిఫోన్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాణ్యత కలిగిన నిత్యావసర వస్తువులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు.

Pages