S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/18/2017 - 05:15

న్యూఢిల్లీ, జనవరి 17: భారత దేశ నూతన పోషకహార విలువల సమాచార పట్టిక 2017ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (నిన్) బుధవారం నాడు విడుదల చేయనుంది. రెండు రోజులపాటు ఢిల్లీలో పోషకహారం పై జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పట్టికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రి జెపి నడ్డా విడుదల చేస్తారు.

01/18/2017 - 05:15

అమరావతి, జనవరి 17: రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర చెల్లించి కందులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. దావోస్ నుంచి మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కందులను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

01/18/2017 - 05:14

మదనపల్లె, జనవరి 17: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమం కాగా, మరో ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడు టానామిట్టవద్ద చోటుచేసుకుంది. బతుకుజీవనం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళివచ్చి స్వగ్రామంలో స్థిరపడాలని కొత్తఆటో కొనుగోలు చేసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

01/17/2017 - 05:20

శ్రీకాకుళం(రూరల్): ఉమ్మడి కుటుంబాలు కనుమరుగున్న నేపథ్యంలో శ్రీకాకుళం పెద్దబరాటం వీధికి చెందిన ఉమ్మడి కుటుంబం ఐదు తరాల వారితో సంక్రాంతి వేడుకలను ఒకేచోట జరుపుకుంది. ఉద్యోగాలు, వలసల నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాల్లో సందడి, సరదా పరిమితమైపోయిన తరుణంలో నగరానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబంలో 156మంది సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుపుకోవడాన్ని ఈ ప్రాంతంలో అంతా గొప్పగా చెప్పుకున్నారు.

01/17/2017 - 05:16

విశాఖపట్నం, జనవరి 16: నవ్యాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాదారులకు సహకరిస్తూ రికార్డులను తారుమారు చేస్తూ తమవంతు సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు కోట్లు దండుకుంటున్నారు. దీనికి తోడు ప్రైవేటు భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి.

01/17/2017 - 03:50

విజయవాడ (క్రైం), జనవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాలు, ఫ్లెక్సీల విధ్వంసాన్ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ తరహా ఘటనలకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల ఇక కఠినంగా వ్యవహరించనుంది. దీంతో విగ్రహాలు, ఫ్లెక్సీల ఏర్పాటుపై నియంత్రణ అమల్లోకి రానుంది. ఇందుకోసం మరుగున పడిన 2003లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను తెర మీదకు తీసుకొచ్చింది.

01/17/2017 - 03:47

అమరావతి, జనవరి 16: శాసనమండలి చైర్మన్‌గా మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. ప్రస్తుత చైర్మన్ చక్రపాణి పదవీకాలం మార్చికి ముగియనుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

01/17/2017 - 03:45

హైదరాబాద్, జనవరి 16: దళిత రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని జనవరి 17 నాటికి ఏడాది పూర్తయినా నిందితులపై ఎలాంటి కేసు పెట్టలేదని , దళిత హక్కుల దినంగా రోహిత్ వర్ధంతిని నిర్వహిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పేర్కొంది.

01/17/2017 - 03:45

అమరావతి, జనవరి 16: ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం- డబ్ల్యుఈఎఫ్) 47వ వార్షిక సదస్సు ఈ నెల 17న ప్రారంభం కానుంది. 20 వరకు జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ సమస్యల వలయంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వాటి పరిష్కారానికి ఈ సదస్సు కీలకం కానుంది. ‘స్పందించే బాధ్యతాయుత నాయకత్వం’ అనే ఇతివృత్తంతో ఈ దఫా సమావేశాలు జరగనున్నాయి.

01/17/2017 - 03:44

న్యూఢిల్లీ, జనవరి 16: చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రులకు రెండు సంవత్సరాల పాటు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి (కారా) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఒకవైపు దత్తత ఇవ్వడానికి కారా వద్ద కేవలం 1,800 మంది పిల్లలు మాత్రమే అందుబాటులో ఉండటం, పి ల్లల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో కారా ఈ సూచన చేసింది.

Pages