S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/20/2017 - 05:03

గూడెంకొత్తవీధి, జనవరి 19: విశాఖ మన్యంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఒక పక్క మంచు, మరో పక్క చలితో గిరిజనులు బయటకు రాలేని పరిస్థితి. గత 10 రోజుల నుంచి చూస్తే గురువారం తెల్లవారు జామున లంబసింగిలో రెండు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, చింతపల్లిలో 5, గూడెంకొత్తవీధిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

01/20/2017 - 05:02

విజయవాడ, జనవరి 19: రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. వివిధ శాఖల మంత్రులు, విభాగాధిపతులతో ఈ నెల 23 నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల మూడు రోజుల పాటు వరుసగా సమావేశం సమావేశం కానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.34 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రూపొందించారు.

01/20/2017 - 05:01

శ్రీకాకుళం, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ రోగుల పరీక్షల కోసం ఇంటింటి సర్వేకు నాంది పలికింది. సుమారు 800 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.

01/20/2017 - 03:12

గుంటూరు, జనవరి 19: రైతు భరోసా యాత్ర పేరుతో రాజధాని గ్రామాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా సచివాలయం మీదుగా కాన్వాయ్, ర్యాలీలను అనుమతించేదిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. షెడ్యూల్ ప్రకారం జగన్ తాడేపల్లి, నిడమర్రు, కురగల్లు, వెలగపూడి, ఉద్ధండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది.

01/20/2017 - 03:10

న్యూఢిల్లీ, జనవరి 19: రేషన్ దుకాణాల్లో నగదు రహిత లాలాదేవీలు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కృష్ణా జిల్లా కలెకర్ట్ బాబు అన్నారు. చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలను అవలంబిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

01/20/2017 - 03:10

భీమవరం, జనవరి 19: రాష్ట్రంలోని టర్నోవర్ ట్యాక్స్ (టిఒటి), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వ్యాపారులు కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లో చేరేందుకు పరుగులు తీస్తున్నారు. ఎవరికి వారు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి తమ పేర్లు, ఫొటోలతో వివరాలను అప్‌లోడ్ చేసుకుంటున్నారు.

01/20/2017 - 03:07

న్యూఢిల్లీ, జనవరి 19:విజయవాడ - వేలాంకణి (తమిళనాడు) మధ్య ప్రతి రోజు రైలును నడపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుకి ఏంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాని కేంద్రమంత్రికి గురువారం లేఖ రాశారు. క్రైస్తవులు నిత్యం వేలాదిమంది ఆంధ్రప్రదేశ్‌నుంచి తమిళనాడులోని వేలాంకణి చర్చికి వెడతారని, విజయవాడ నుంచి నేరుగా రైలు లేనందున ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

01/20/2017 - 03:07

హైదరాబాద్, జనవరి 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి అధిపతుల ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో శాసన సభ పద్దుల కమిటీల సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఏపి శాసనసభ కార్యదర్శి కె సత్యనారాయణరావు తెలిపారు. ప్రభుత్వ శాఖలు, డైరెక్టరేట్లు అమరావతికి మారినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా తదుపరి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.

01/19/2017 - 08:38

రాజమహేంద్రవరం, జనవరి 18: పాపికొండలు జాతీయ పార్కుకు రక్షణ కరువైంది. అటవీ శాఖ వన్యప్రాణి విభాగంలో సిబ్బంది కొరత కారణంగా పహారా గాలికొదిలేశారు. ఎంతో విలువైన వృక్ష సంపద, అరుదైన జంతుజాలం కలిగిన పాపికొండలు జాతీయ పార్కు సంరక్షణ దైవాధీనంగా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో రేంజిల పునర్వ్యస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు.

01/19/2017 - 08:37

సూళ్లూరుపేట, జనవరి 18: ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రికార్డు ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహం చేస్తోంది. ఇంత వరకు అగ్రరాజ్యాలు చేయని ప్రయత్నాన్ని మన శాస్తవ్రేత్తలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకటి రెండు కాదు ఒకేసారి 103 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

Pages