S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/16/2017 - 04:20

చంద్రగిరి, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామంలో మూడు రోజులపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకు చేరడంతో ఆ పల్లె కళకళలాడింది. ముఖ్యంగా నారావారిపల్లె వాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్‌ను చూసి మురిసిపోయారు. సర్వసాధారణంగా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబ సభ్యులను చూడటానికి పల్లెవాసులు ప్రతి ఏడాది ఆసక్తి చూపేవారు.

01/16/2017 - 04:15

అంబాజీపేట, జనవరి 15: తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో సంక్రాంతి పర్వదినాల్లో ఏటేటా కనుమరోజు జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం ఆదివారం కన్నుల పండువగా సాగింది. మొసలపల్లి పంచాయతీ పరిధిలోని కొబ్బరితోటలో ఏకాదశరుద్రులు కొలువుదీరి భక్తులను ఆనంద పరవశులను చేశారు. సుమారు 400 వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రభల ఉత్సవానికి ఏంతో పేరుంది.

01/16/2017 - 04:11

విశాఖపట్నం, జనవరి 15: విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేస్తోంది. వచ్చేనెల తొలివారంలోనే ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌లో జోన్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనేక అంశాలు బలాన్నిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా విశాఖకు ప్రత్యేక రైళ్ళు విపరీతంగా వస్తున్నాయి. వీటిలో కొన్ని కొనసాగుతున్నాయి కూడా.

01/16/2017 - 04:10

తిరుపతి, జనవరి 15: తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకునే భక్తులు గోశాలను సందర్శించేందుకు కూడా టిటిడి తగిన ఏర్పాట్లు చేయాలని, అలా చేయగలిగితే భక్తుల యాత్రకు మరింత పరిపూర్ణత చేకూరుతుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.

01/16/2017 - 04:09

కాకినాడ, జనవరి 15: ఏటా నిర్వహిస్తున్న సాగర సంబరాలు (బీచ్ ఫెస్టివల్)తో కాకినాడ నగరానికి పేరు ప్రఖ్యాతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ తీర ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన సాగర సంబరాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు హాజరు కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

01/16/2017 - 04:08

నరసరావుపేట, జనవరి 15: ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేయటంతో చిన్నవ్యాపారాలు, కుటీర పరిశ్రమలు కుదేలయ్యాయని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల 60నుండి 70శాతం వరకు వ్యవసాయం కుంటుపడిందని చెప్పారు.

01/16/2017 - 03:31

విజయవాడ, జనవరి 15: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ఆగమేఘాలపై సరికొత్త ప్రాజెక్టులు మంజూరు చేయించడమే కాకుండా నిధులు మంజూరు చేయించి శంకుస్థాపనలు, ఆపై ప్రారంభోత్సవాలు కూడా జరిపిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తాజాగా రాజధాని అమరావతిపై దృష్టి సారించారు. ఇటీవలి కాలంలో సగటున వారానికోసారైనా రాష్ట్ర పర్యటనకు వస్తూ విజయవాడను మాత్రం తప్పక సందర్శిస్తున్నారు.

01/16/2017 - 03:27

తిరుపతి, జనవరి 15: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన చంద్రగిరి నియోజకవర్గంలో కనుమ పండుగను పురస్కరించుకుని ఆదివారం ఉత్సాహంగా.. ఉద్వేగంగా జల్లికట్టు జరిగింది. మండలోని పుల్లయ్యగారిపల్లె, రంగంపేట, మల్లయ్యగారి పల్లె, నారావారిపల్లె, అరిగిరివారిపల్లె, కొటాలా, కందులవారిపల్లె, నర్సింగాపురం, భీమవరం ప్రాంతాల్లో జరిగిన జల్లికట్టులో సుమారు 1700 పశువులు పాల్గొన్నాయి.

01/16/2017 - 03:25

విజయవాడ, జనవరి 15: అత్యున్నత న్యాయస్థాన ఆంక్షలు.. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ముందెన్నడూ లేనివిధంగా రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట జూదం జోరుగా సాగాయి. పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల భయమనేది లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ప్రత్యేక ‘జూద’ శిబిరాలు వెల్లివిరిశాయి.

01/16/2017 - 03:23

విజయవాడ, జనవరి 15: తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండుగ సందర్భంగా బంధుమిత్రులతో గడిపేందుకు వేర్వేరు ప్రాంతాల నుండి స్వస్థలానికి వచ్చిన వారంతా ఆదివారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయాణం కట్టారు. సోమవారం కార్యాలయాలు పనిచేయడంతో కనుమ అయినప్పటికీ అత్యధికులు బయలుదేరారు. వీరందరితో బస్సు, రైల్వే స్టేషన్లు సాయంత్రం నుండి కిటకిటలాడాయి.

Pages