S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/21/2016 - 03:21

కడప, అక్టోబర్ 20: కడప నగరంలోని జువైనల్ హోమ్‌లో గురువారం తెల్లవారుజామున ఓ బాలనేరస్తుడిని సహచరుడు గొంతునులిమి చంపాడు. జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు వన్‌టౌన్ సిఐ కె.రమేష్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. ఇద్దరు పిల్లలపై జనవరి 26న జిల్లాలోని ప్రొద్దుటూరు టుటౌన్ పోలీసుస్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైంది. దీంతో వీరిద్దరినీ కడప జువైనల్ హోమ్‌కు తరలించారు.

10/21/2016 - 03:17

ఏలూరు, అక్టోబర్ 20:పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న బలభద్ర రితేష్ (24) అనే యువకుడు గురువారం మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దానవాయిపేటకు చెందిన రితేష్ కొద్దికాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్నాడు.

10/21/2016 - 03:15

విజయవాడ, అక్టోబర్ 20: తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోటంలో ఎపి పోలీస్ భారతదేశంలోనే అగ్రస్థానంలో వుందని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు.

10/21/2016 - 03:13

అనంతపురం, అక్టోబర్ 20: బెంగళూరులో కిడ్నాప్‌కు గురై బడా గ్యాంగ్‌స్లర్ల చేతిలో చావుదెబ్బలు తిన్న మధుసూదన్‌రెడ్డి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎవరీ మధుసూదన్‌రెడ్డి అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం యర్లంపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి మద్దెలచెరువు సూరి అనుచరుడు. సూరి తరఫున భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసేవాడు.

10/21/2016 - 03:11

హైదరాబాద్, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారని, ఈ వివరాలపై రాష్ట్రప్రజలకు నమ్మకంలేదని వైకాపా ధ్వజమెత్తింది. గురువారం ఇక్కడ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని తెహల్కా 13 ఏళ్ల క్రితమే ప్రకటించిందని చెప్పారు.

10/21/2016 - 03:10

హైదరాబాద్, అక్టోబర్ 20: తిరుపతిలోని స్విమ్స్ వైద్యకళాశాలలో వెంటిలేటర్ల కొరతపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపి వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరుజిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, స్విమ్స్ సూపరింటెండెంట్‌కు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ధర్మాసనం సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది.

10/21/2016 - 03:09

అనంతపురం, అక్టోబర్ 20 : రాష్ట్రంలో అధిక ధరకు మద్యం విక్రయాలు జరిపితే కఠినచర్యలు తప్పమని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంఅర్‌పిని తూచాతప్పకుండా అమలు చేయాలని అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీని అతిక్రమించే వారిపై విధించే అపరాధ రుసుం(కాంపౌండ్) రూ.5 లక్షలకు పెంచామన్నారు.

10/20/2016 - 08:24

హైదరాబాద్ అక్టోబర్ 19: ‘పేరుకే మేమంతా ప్రజాప్రతినిధులం. పెత్తనమంతా అధికారులదే. కలెక్టర్లు మాట వినరు. చివరకు ఆర్డీవోలు కూడా లెక్కచేసే పరిస్థితి లేదు. మా సార్ కూడా అధికారులనే అందలమెక్కిస్తున్నారు. సీఎంఓ నుంచి కలెక్టర్ల వరకూ అంతా అధికారుల రాజ్యమే నడుస్తోంది. అందుకే మా క్యాడర్‌కు ఏమీ చేయలేకపోతున్నాం. ఎన్నికల్లో కార్యకర్తలు పనిచేస్తారు గానీ అధికారులు కదా?

10/20/2016 - 08:24

విజయవాడ, అక్టోబర్ 19: తెలుగు భాషాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ఐటి, వక్ఫ్ శాఖల మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. తెలుగు భాషాభివృద్ధి దిశగా తెలుగు ప్రాధికార సంస్థ నిర్మాణం, అకాడమీల పునరుద్ధరణ క్రమంలో తగిన సూచనల ఆహ్వానానికి మేధావులు, కళాకారులు, భాషావేత్తలతో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు.

10/20/2016 - 08:23

హైదరాబాద్, అక్టోబర్ 19: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ (నర్సరీ- ఎల్‌కెజి, యుకెజి ) తరగతులు ప్రారంభించాల్సిందిగా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చైర్మన్, పంజాబ్ విద్యాశాఖా మంత్రి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా తన నివేదికలో స్పష్టం చేశారు. 189 పేజీల నివేదికను డాక్టర్ చీమా కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అందజేశారు.

Pages