S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/22/2016 - 07:27

విజయవాడ, అక్టోబర్ 21: తీవ్రవాదాన్ని ఎదుర్కోటంలో భారతదేశంలోనే ఎపి పోలీసుకు ప్రత్యేక స్థానం ఉందంటూ, కాలానుగుణంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

10/22/2016 - 07:26

రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: వ్యవసాయ యాంత్రీకరణను అందిపుచ్చుకుని గోదావరి చెంతన రైతులు ఖరీఫ్ ముందస్తు దిగుబడి సాధించి రికార్డు సాధించారు. దాదాపు నెల రోజుల ముందుగానే ఆశాజనకమైన దిగుబడి సాధించి ప్రయోగాత్మకంగా ముందున్నారు. దాదాపు ముఫ్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ మేరకు ముందస్తు దిగుబడి సాధించడం విశేషత సంతరించుకుంది. సాధారణంగా ఖరీఫ్ వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది.

10/22/2016 - 07:14

విజయవాడ, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నగరానికి విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం ఆయన బస చేసిన ఓ స్టార్ హోటల్‌లో ఏకాంతంగా కల్సి దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు.

10/22/2016 - 07:13

తిరుమల, అక్టోబర్ 21: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు బసచేసే టిటిడి వసతి గదులకు ఇప్పటి వరకు చెల్లించే కాషన్ డిపాజిట్‌ను సోమవారం నుంచి రద్దు చేయాలని టిటిడి ఇఓ సాంబశివరావు నిర్ణయించారు. గది అద్దెకు తీసుకుని తిరిగివెళ్లే సమయంలో అటెండర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు తిరుగు ప్రయాణానికి రైళ్లు, విమానాల్లో వెళ్లే భక్తులు సమయం మించిపోతుందనే ఆందోళనతో కాషన్ డిపాజిట్‌ను వదలివెళ్తున్నారు.

10/22/2016 - 07:11

విజయవాడ (బెంజిసర్కిల్), అక్టోబర్ 21: విభజన అనంతరం రాష్ట్రానికి వచ్చిన కష్టాలను తన భుజాలపై వేసుకుని రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దేశంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉంచాలనే తలంపుతో పనిచేస్తున్న తనకు అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

10/22/2016 - 02:27

విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు తాను చేపట్టిన సుదీర్ఘమైన పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద కాపు సామాజికవర్గాన్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు తాను స్వయంగా సంసిద్ధత వ్యక్తం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

10/22/2016 - 02:21

గుంటూరు, అక్టోబర్ 21:విభజన చట్టం హామీల అమలుకు కేంద్రంపై మరోసారి ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కాదని ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశం ప్రస్తావనకు వచ్చింది.

10/22/2016 - 02:19

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో కావాలని కోరితే నాంపల్లిలోని ‘గృహకల్ప’ భవనం ఇవ్వాలని మంత్రిమండలిలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో తాము ఖాళీ చేసిన భవనాలను అప్పగిస్తే వారికి ఏ భవనం ఇద్దామన్న చర్చ మంత్రిమండలిలో జరిగినట్టు సమాచారం.

10/22/2016 - 02:09

మాచర్ల, అక్టోబర్ 21: గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘ మొదటి మహిళా చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి (28) శుక్రవారంనాడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలలకిందట శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీదేవి తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బంధువులు తెలిపారు.

10/22/2016 - 02:00

విశాఖపట్నం, అక్టోబర్ 21: తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవులకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మయన్మార్ దిశగా కదులుతూ, మరో 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం రాత్రి తెలిపింది.

Pages