S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/20/2016 - 08:23

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆంధ్ర రాష్ట్రంలో ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేస్తామని, విద్యుత్ పొదుపునకుకు ఎల్‌ఇడి బల్బులను అమర్చడం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

10/20/2016 - 08:23

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో 2017 మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు గడువును బోర్డు కార్యదర్శి కె. సంధ్యారాణి తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 1వ తేదీ వరకూ తమ పరీక్ష దరఖాస్తులను దాఖలు చేయవచ్చని బోర్డు సూచించింది.

10/20/2016 - 08:11

విశాఖపట్నం, అక్టోబర్ 19: వివిధ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా నియామకానికి సంబంధించిన అర్హత పరీక్ష ఎపి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్) 2016 ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫ్లాటినం జుబ్లీ అతిథి గృహంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇందులో 2949 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.

10/20/2016 - 08:11

పాలకొల్లు, అక్టోబర్ 19: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు, శుక్రవారాల్లో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ అర్గనైజేషన్ తరపున గజల్స్ శ్రీనివాస్ నేతృత్వంలో మహాకుంభాభిషేకం జరగనుంది.

10/20/2016 - 08:11

విశాఖపట్నం, అక్టోబర్ 19: ఏజెన్సీ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలను కేంద్రానికి అందజేసినట్టు ఆర్‌అండ్‌బి జాతీయ రహదారుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఆర్ గోపాలకృష్ణ వెల్లడించారు. విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించే అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

10/20/2016 - 08:10

ఒంగోలు,అక్టోబర్ 19:షిర్డి సాయి దైవం కాదు సైతాన్ అని ఉత్తరాయణ బదిరి జ్యోతి పీఠం, ద్వారక శారదపీఠం పీఠాధిపతి స్వరూపనందా సరస్వతి మహారాజ్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఒంగోలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూత,ప్రేతాత్మలను వదిలేసే విధంగా షిర్డి సాయిబాబా సన్నిధిలో చేస్తారన్నారు. ఇదేవిషయాన్ని షిర్డిసాయి సంస్ధాన్‌వారిని సాయిబాబా దేవుడుకాదని, సైతాన్ అని ఛాలెంజ్ చేశామన్నారు.

10/20/2016 - 08:09

గుంటూరు, అక్టోబర్ 19: నకిలీ విత్తన తయారీ కంపెనీలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. నకిలీ విత్తనం తయారీ నుంచి రైతుకు చేరేవరకు మధ్యలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వదిలేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ఇందులో భాగంగా నకిలీ మిర్చి విత్తనాలను తయారు చేసి రైతులను నట్టేట ముంచిన జీవా విత్తన కంపెనీ ఎండిని అరెస్ట్ చేయించింది. మరో విత్తన కంపెనీ బ్రహ్మపుత్ర ఎండిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

10/20/2016 - 08:09

విజయవాడ, అక్టోబర్ 19: వినూత్న ఆలోచన కేంద్రాలు (ఇన్నోవేషన్ సెంటర్స్), అంకుర కేంద్రాలు (ఇంక్యూబేషన్ సెంటర్స్)లలో వివిధ స్థాయిల్లో రూపుదిద్దుకున్న నూతన ఆవిష్కరణలు వాణిజ్య స్థాయికి ఎదిగి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ సూచించారు.

10/20/2016 - 08:08

విశాఖపట్నం, అక్టోబర్ 19: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రం జరగడం లేదు. పార్టీ సమన్వయం అనేది లేనే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య దాదాపూ మృగ్యమైపోయింది. జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఎడ ముఖం..పెడ ముఖంగా ఉంటున్నారు. ప్రభుత్వ శాఖల సమీక్షలను ఏనాడో జిల్లా మంత్రులు పక్కన పెట్టేశారు.

10/20/2016 - 07:59

విశాఖపట్నం, అక్టోబర్ 19: సముద్ర జలాల పరిరక్షణకు అహరహం శ్రమిస్తున్న భారత తీర రక్షణ దళంలోకి మరో అత్యాధునిక నౌక వచ్చి చేరింది. స్వాతంత్య్ర సమరయోధురాలు, ఆధ్యాత్మికవేత్త మణిపాల్ ప్రాంతానికి చెందిన రాణి గైడిల్యు పేరిట రూపొందించిన కోస్ట్‌గార్డ్ నౌకను బుధవారం విశాఖలో జలప్రవేశం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోస్ట్‌గార్డ్ డైరక్టర్ జనరల్ రాజేంద్ర సింగ్ లాంఛనప్రాయంగా ఈ నౌకను జలప్రవేశం చేయించారు.

Pages