S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/21/2016 - 23:14

గుంటూరు, అక్టోబర్ 20: రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా రాష్ట్రంలో డీ లిమిటేషన్‌కు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉందని, నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు తెలిపారు. గురువారం గుంటూరులోని తన నివాసానికి గవర్నర్ నరసింహన్ వచ్చి వెళ్లిన అనంతరం ఎంపి రాయపాటి విలేఖర్లతో మాట్లాడారు.

10/21/2016 - 23:13

విజయవాడ, అక్టోబర్ 20: నూతన రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2019 నాటికి 1312 కి.మీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే ఉన్న సమస్యలు పరిష్కరించి రోడ్డు నిర్మాణ పనులు అధికారులు వేగవంతం చేశారు.

10/21/2016 - 04:02

విశాఖపట్నం, అక్టోబర్ 20: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు అవకాశం ఇస్తామని, వారికి కంటెంట్‌ను అందచేస్తామన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో, కళాశాలల్లో ఉచితంగా వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

10/21/2016 - 04:00

విశాఖపట్నం, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అకాడెమీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సౌత్ జోన్ ర్యాకింగ్ నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ 2016 పోటీలను విశాఖలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కొమ్మాదిలో రూపుదిద్దుకోనున్న క్రీడా ప్రాంగణంలో టిటి అకాడెమీకి స్థలం కేటాయించేందుకు అంగీకరించారు.

10/21/2016 - 03:58

విశాఖపట్నం, అక్టోబర్ 20: లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నారని విశాఖకు చెందిన ఒక పాఠశాల విద్యార్థిని ఆరోపించారు. విశాఖ ఎయులో డిజిటల్ క్లాస్ రూంల ప్రారంభోత్సవం అనంతరం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కైప్ ద్వారా మాట్లాడారు. విశాఖకు చెందిన కొంతమంది విద్యార్థులతో మాట్లాడించారు.

10/21/2016 - 03:56

కదిరి, అక్టోబర్ 20: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో సోలార్ హబ్‌కు భూములు కోల్పోయి పరిహారం అందని రైతులను పరామర్శించడానికి గురువారం వచ్చిన సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకుని దౌర్జన్యం చేశారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, జిల్లా నాయకులు సోలార్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది.

10/21/2016 - 03:54

కాకుమాను, అక్టోబర్ 20: ఆస్తి కోసం వత్తిడి చేశాడన్న కోపంతో కన్నకొడుకునే దారుణంగా హతమార్చిందో తల్లి. కర్కశంగా హతమార్చి, అవయవాలను సైతం వేరుచేసి, మృతదేహాన్ని కూడా గుట్టుగా మాయం చేసేందుకు యత్నించింది. గుంటూరు జిల్లా, కాకుమాను మండలం, బోడిపాలెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బోడిపాలెంకు చెందిన బత్తినేని అంజనాదేవి, శంకరరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

10/21/2016 - 03:52

పాలకొల్లు, అక్టోబర్ 20: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం క్షీరారామంలో మహా కుంభాభిషేకం మహాక్రతువు గురువారం వైభవంగా ప్రారంభమయ్యింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తొలుత 33 మంది భక్తులు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి, ఆలయ ప్రవేశం చేశారు. 11 మంది రుత్విక్కులు వీరిచే దీక్షాధారణ చేయించారు.

10/21/2016 - 23:12

అనంతపురం, అక్టోబర్ 20: రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు సాధ్యమైనంత త్వరగా ఇన్‌ఫుట్ సబ్సిడీ అందజేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. మొత్తం రూ.678 కోట్లు ఇందుకోసం కేటాయించామన్నారు. ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని ఆయన తెలిపారు.

10/21/2016 - 03:23

విశాఖపట్నం, అక్టోబర్ 20: విశాఖ జిల్లా సబ్బవరం వద్ద నిర్మించనున్న పెట్రోలియం యూనివర్శిటీ సభకు హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పెట్టుకున్న తలపాగా రహస్యాన్ని సభికులకు వివరించారు. వెంకయ్య నాయుడు వేదిక మీద ఆశీనులైన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అతిథులను తలపాగలు, టోపీలతో అలంకరించారు. ఇదే సమయంలో వెంకయ్య నాయుడుకు రాజస్ధానీ సంప్రదాయంతో తయారు చేసిన తలపాగా పెట్టారు.

Pages