S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/08/2016 - 06:32

విజయవాడ, అక్టోబర్ 7: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్ముఖనామ సంవత్సర దసరా మహోత్సవాల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారం కావటంతో మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన బెజవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిదేవిగా ఆశీనులై భక్తజనానికి దర్శనమిచ్చింది. దసరా సెలవులు.. అన్నింటిని మించి మహిళలకు పవిత్రమైన దినం కావటంతో తెల్లవారుఝాము నుంచే వేల సంఖ్యలో భక్తులు ఆబాల గోపాలంతో క్యూలైన్లలో బారులు దీరారు.

10/08/2016 - 06:14

పెదవేగి, అక్టోబర్ 7 : పాఠశాలకు వెళ్లలేదనే కారణంతో కన్నతండ్రి తీవ్రం గా కొట్టడంతో ఒక బాలిక మృతిచెందింది. మృతదేహాన్ని రహస్యంగా ఖననంచేసిన ఆ కిరాతకుడు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భార్యను కూడా బెదిరించాడు. గత నెల 22వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

10/08/2016 - 06:14

జంగారెడ్డిగూడెం/ కొయ్యలగూడెం, అక్టోబర్ 7: కుటుంబ కలహాలతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన తండ్రి ఉదంతమిది. తండ్రి, రెండేళ్ల కుమార్తె మృతిచెందగా, ఏడు నెలల పసికందైన మరో కుమార్తె మృత్యువుతో పోరాడుతోంది. ద్వారకాతిరుమల మండలం దోరసానిపాడుకు చెందిన లక్కాబత్తుల లూథిరాజుకు, కొయ్యలగూడెం మండలం రామానుజపురానికి చెందిన స్వాతికి మూడేళ్ల క్రితం వివాహమైంది.

10/08/2016 - 06:13

హైదరాబాద్, అక్టోబర్ 7: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని, ఇది రాష్ట్భ్రావృద్ధికి విఘాతంగా పరిణమించిందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రులు, నేతలతో జరిగిన సమీక్ష కార్యక్రమంలో లోకేశ్ సీనియర్ మంత్రులు, నేతలను అవమానించారన్నారు.

10/08/2016 - 06:12

హైదరాబాద్, అక్టోబర్ 7: బిజెపి విజయవాడ నగర అధ్యక్షుడు డాక్టర్ ఉమామహేశ్వరరాజు సస్పెన్షన్‌పై బిజెపి కోర్‌కమిటీ చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 15న విశాఖలో కోర్‌కమిటీ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా రాజు సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఈ భేటీలో గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు.

10/08/2016 - 03:06

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: ఖరీఫ్ సీజన్‌లో రైతులు విత్తుతోనే చిత్తయ్యారు. కోస్తా నేలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త వరి వంగడం ఖరీఫ్ రైతును దగా చేసింది. రికార్డు స్థాయి దిగుబడులు అందిస్తుందనుకున్న విత్తనం కాస్తా కేళీ అని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు.

10/08/2016 - 02:57

కడప, అక్టోబర్ 7: కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణాజలాలను తరలించేందుకు చేపట్టిన పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. టిబిసిహెచ్‌ఎల్‌సి ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. నీళ్లు వదిలితే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.

10/08/2016 - 02:56

శ్రీశైలం, అక్టోబర్ 7: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబదేవి శ్రీకాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమల్లికార్జునస్వామి, అమ్మవార్లకు గజవాహనం సేవ నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, హోమాలు నిర్వహించారు.

10/08/2016 - 02:52

గుంటూరు, అక్టోబర్ 7: నర్సరీలకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. కడియం తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీలను అనుమతించడంతో పాటు లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల నియంత్రణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

10/08/2016 - 02:51

గుంటూరు, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో రబీకి వ్యవసాయ ప్రణాళిక సిద్ధమైంది. ఈనెల 15వ తేదీతో ఖరీఫ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రబీకి లక్ష్యాలను నిర్దేశించారు. శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో 43 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు గాను 40 లక్షల హెక్టార్లను లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.

Pages