S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/08/2016 - 02:50

హైదరాబాద్, అక్టోబర్ 7: గత రెండున్నరేళ్ల నుంచి ప్రజాప్రతినిధులు, నేతలకు సమయం కేటాయించని పార్టీ అధినేత మూడురోజుల వారితో మమేకమయ్యారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. అధినేత దగ్గరున్న సమాచారం తప్పనీ వాదించారు. ఇద్దరూ తమ లోపాలేమిటో చర్చించుకున్నారు. మొత్తంగా అధినేత-నేతల మధ్య దూరం తగ్గింది. అనుబంధం పెంచింది. ఇదీ గుంటూరు కెఎల్ వర్శిటీలో ముగిసిన మూడురోజుల తెదేపా శిక్షణ శిబిరాల ఫలితం.

10/08/2016 - 02:47

రాజానగరం, అక్టోబర్ 7: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్టణం గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి శుక్రవారం రూ.3కోట్ల కరెన్సీతో అలంకరణ చేశారు. ఏటా నవరాత్రి ఉత్సవాలకు ఈ గ్రామంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది రికార్డుస్థాయిలో రూ.3 కోట్ల కరెన్సీతో అలంకరించారు. రూ.1000, రూ.500 తదితర నోట్లతో అలంకరణ చేపట్టారు.

10/08/2016 - 02:44

పోలవరం, అక్టోబర్ 7: బహుళార్ద సాధక పోలవరం ప్రాజెక్టు త్రీడీ నమూనాను తయారుచేయనున్నారు. ఇందులో భాగంగా పూణె నుండి శాస్తవ్రేత్తలు శుక్రవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చి ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు భాశేఖర్, మీనా జాక్ త్రిడి నమూనా తయారు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం వచ్చినట్టు ప్రాజెక్టు ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు.

10/08/2016 - 02:42

సీలేరు, అక్టోబర్ 7: ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై ఆంధ్రా-ఒడిశా అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ నీటిని ఏ ఏ రాష్ట్రాలు ఎంతెంత వినియోగించుకున్నాయనే దానిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఎంత నీటి నిల్వలున్నాయనే దానిపై లెక్కలు కట్టారు.

,
10/07/2016 - 03:04

శ్రీశైలం, అక్టోబర్ 6: శ్రీశైలం మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం భ్రమరాంబ అమ్మవారు కాత్యాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్లన్నస్వామి, అమ్మవార్లకు పూలపల్లకి సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిత్యం పూజాదికాలు నిర్వహిస్తున్నారు.

10/07/2016 - 03:01

విజయవాడ, అక్టోబర్ 6: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్ముఖనామ సంవత్సర దసరా మహోత్సవాల్లో ఆరో రోజైన గురువారం శ్రీ చక్రానికి అధిష్టాన శక్తి పంచ దశాక్షరీ మహా మంత్రాది దేవతా త్రిపురాత్రయంలో రెండో శక్తి అయిన శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బెజవాడ దుర్గమ్మ భక్తకోటికి దర్శనమిచ్చింది.

10/07/2016 - 02:59

ఏలూరు, అక్టోబర్ 6 : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడమే కాక, ప్రజలకు సేవే లక్ష్యంగా సిబ్బంది పనిచేసేలా సంస్కరణలు అమలుచేస్తున్నట్లు రాష్ట్ర డిజిపి ఎన్ సాంబశివరావు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో త్వరలో మోడల్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుతో పాటు డిజిటల్ వాచ్‌కు సన్నాహాలుచేస్తున్నామన్నారు. అలాగే మొబైల్ కంట్రోల్ రూం ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు.

10/07/2016 - 02:58

విశాఖపట్నం, గూడెంకొత్తవీధి, అక్టోబర్ 6: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలంలో బుధవారం సాయంత్రం మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలంలోని పెదపాడు, కుంకుపూడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది.

10/07/2016 - 02:56

కొల్లిపర, అక్టోబర్ 6: ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజకీయ దురంధరుడు, నాలుగుసార్లు గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుండి ఎన్నికైన మాజీ శాసనసభ్యుడు గుదిబండి వెంకటరెడ్డి (74) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రజల సందర్శనార్థం గుదిబండి పార్థివదేహాన్ని కొల్లిపరలోని స్వగృహంలో ఉంచారు.

10/07/2016 - 02:55

అనకాపల్లిరూరల్, అక్టోబర్ 6: విశాఖ జిల్లా రూరల్ అనకాపల్లి పరిధి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ మూసివేత దిశగా వెళ్తోంది. ఇక్కడకు వచ్చే చెరకును సమీపంలోని ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని రాష్ట్ర సుగర్స్ డైరక్టర్ నుండి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కార్మికులు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Pages