S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/07/2016 - 02:54

ఒంగోలు/నెల్లూరు , అక్టోబర్ 6:ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె రాంప్రసాద్ ఇంటిపై అతని బంధువుల ఇళ్ళపై గురువారం ఉదయం నుంచి ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖాధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. రాంప్రసాద్ సొంత ఇళ్ళపైనే కాకుండా ఒంగోలు, వినుకొండ, నెల్లూరులో ఉన్న ఆయన బంధువుల ఇళ్ళపైన, ఒంగోలులోని ఆర్‌టిఒ కార్యాలయంలోను సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

10/07/2016 - 02:52

విశాఖపట్నం (గోపాలపట్నం), అక్టోబర్ 6: గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఎఎన్ 32తో పాటు తమవారి జాడ తెలియక గత మూడు నెలలుగా మానసిక క్షోభకు గురైన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను ఉన్నతాధికారులు ఒక్కసారిగా నైరాశ్యంలోకి నెట్టేశారు.

10/07/2016 - 02:51

మడకశిర, అక్టోబర్ 6: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 17వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రానికి కావేరి నదీజలాలు విడుదల చేయనున్నట్లు కర్నాటక రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ్ తెలిపారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తమిళనాడు, కర్నాటక ప్రజలు ఎవరూ కావేరి జలాల కోసం ఘర్షణలు జరగాలని కోరుకోవడం లేదన్నారు.

10/07/2016 - 02:50

విశాఖపట్నం, అక్టోబర్ 6: పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి)లో ఒక ఔషధ కంపెనీలో సుమారు 2.6 కోట్ల రూపాయల విలువ చేసే అనుమతి లేని మాదక ఔషధాన్ని ఔషధ నియంత్రణ మండలి అధికారులు బుధవారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు ఫార్మాసిటీలో గల ఆ ఔషధ కంపెనీకి అనుమతి లేదు.

10/07/2016 - 02:50

మండపేట, అక్టోబర్ 6: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో త్వరలో శాంతియుత ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీయిచ్చిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక కరివేపాకులా తీసిపారేస్తున్నారని ఆరోపించారు.

10/07/2016 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 6: నవ్యాంధ్ర రాజధాని నగర కమిటీ అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలో అగ్గి రాజుకుంది.

10/07/2016 - 02:44

హైదరాబాద్, అక్టోబర్ 6: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కి)ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ చేపట్టామని సంస్థ చైర్మన్ , కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్య పేర్కొన్నారు. ఇందుకోసం తాము అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేశామని అన్నారు.

10/07/2016 - 02:43

హైదరాబాద్, అక్టోబర్ 6: కడప జిల్లాలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై నవంబర్ 15వ తేదీన పర్యావరణ అనుమతుల గురించి పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

10/07/2016 - 02:42

హైదరాబాద్, అక్టోబర్ 6: ఆంధ్ర రాష్ట్రంలో ఎల్‌ఇడి వీధి దీపాల వ్యవస్ధను పర్యవేక్షించేందుకు కేంద్రీకృత నియంత్రణ మానిటరింగ్ వ్యవస్ధను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.

10/07/2016 - 02:42

హైదరాబాద్, అక్టోబర్ 6: పోలీసులు కేసుల విచారణలో సుశిక్షితులవ్వాలని, శిక్షణతోపాటు వృత్తి నైపుణ్యతను మెరుగుపరచుకోవాలని ఆర్‌బివిఆర్‌ఆర్ డైరెక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ అకాడమిల సంయుక్త్ధ్వార్యంలో జరుగుతున్న శిక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Pages